Akira Nandan-Renu desai-Tiger Nageswara Rao : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. విడాకులు తీసుకున్న సమయంలో రేణూ దేశాయ్ మీద విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. ఇక ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సమయంలోనూ విపరీతమైన వ్యతిరేకత వినిపించింది. అయితే పవన్ కళ్యాణ్ చేసుకున్నప్పుడు రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముందంటూ సమాజం అంతా కూడా ఆమె వెనకాల నిల్చుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను వదినా అంటూ పిలవడాన్ని కూడా అంగీకరించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా రేణూ దేశాయ్ నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక రేణూ దేశాయ్ గత నెలలో స్కాట్లాండ్ వీధుల్లో విహరించిన సంగతి తెలిసిందే. తన పిల్లలు ఆద్య, అకిరా నందన్‌లతో కలిసి స్కాట్లాండ్ మొత్తం తిరిగి వచ్చేసింది. రేణూ దేశాయ్ తన పిల్లల టాలెంట్ గురించి ఎప్పుడూ చెబుతూ మురిసిపోతూ ఉంటుంది. అకిరా బాక్సింగ్, బాస్కెట్ బాల్, స్టడీస్, మ్యూజిక్ ప్లేయింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాడన్న సంగతి తెలిసిందే. ఆద్య అయితే.. ఫోటోగ్రఫీలో మెలుకువలు నేర్చుకుంటూ ఉంటుంది. రేణూ దేశాయ్ ఫోటోలను తీయడంలో ఆద్య ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది.


అయితే తాజాగా రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీ సెట్‌లో సందడి చేస్తోంది. రవితేజ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో హేమలతా లవణం అనే పాత్రలో రేణూ దేశాయ్ కనిపించబోతోంది. అయితే ఈ వారంలోనే సినిమా సెట్‌లోకి రేణూ దేశాయ్ అడుగు పెట్టేసింది. సెట్‌లో వాతావరణం ఎలా ఉందో చెబుతూ కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. ఎండ ఎక్కువగా ఉందంటూ.. అందరూ గొడుగులు పట్టుకుని ఉన్నారంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరో పోస్ట్ వేసింది రేణూ దేశాయ్.



రేణూ దేశాయ్ సినిమా షూటింగ్‌లో భాగంగా రెడీ అవుతోంది. తన పాత్రకు సంబంధించిన లుక్, మేకప్‌లో బిజీగా మారింది. అయితే ఇలా తాను తన ప్రపంచంలో మునిగిపోయి ఉన్నప్పుడు అకిరా నందన్ ఇలా ఫోటోలు తీసేశాడంటూ.. అద్భుతంగా తీశాడంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అంటే తన తల్లితో పాటు మన జూనియర్ పవర్ స్టార్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడన్న మాట. మరి అకిరా నందన్ తన చిత్రం, డెబ్యూ కోసం సెట్‌లొకి ఎప్పుడు వస్తాడో చూడాలి.


Also Read : Singer Mano Jabardasth : మింగుతా, సింగుతా అంటూ దారితప్పుతోన్న జబర్దస్త్.. డబుల్ మీనింగ్ డైలాగ్‌తో సింగర్ మనో రచ్చ!
​Also Read : Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.