Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?

Ponniyin Selvan 1 Movie Telugu Review: తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న కొన్ని పొన్నియన్ సెల్వన్ సినిమా తెలుగు ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 30, 2022, 01:05 PM IST
Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?

Ponniyin Selvan 1 Movie Telugu Review: తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న కొన్ని పొన్నియన్ సెల్వన్ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది. చాలాకాలం తర్వాత మణిరత్నం నుంచి వస్తున్న సినిమా కావడం, తమిళనాట విశేష ఆదరణ పొందిన పొన్నియన్ సెల్వన్ నవలను సినిమాగా తరికెక్కిస్తూ ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దానికి తోడు తమిళంలో స్టార్ హీరోలుగా ఉన్న విక్రమ్, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల పోషిస్తూ ఉండడం, చాలా కాలం తర్వాత ఐశ్వర్యారాయ్ సౌత్ లో ఒక హీరోయిన్ రోల్లో సినిమా చేయడం త్రిష, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాల రెట్టింపు అయ్యాయి. దానికి తగినట్లుగానే దక్షిణాది భాషల్లో సహ హిందీలో కూడా సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసింది పొన్నియన్ సెల్వన్ టీమ్. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 500 పైగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.

కథ:
పొన్నియన్ సెల్వన్ అనేది ముందే నవలగా వచ్చి తమిళంలో విశేష ఆదరణ పొందింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే చోళ యువరాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్) తన సేనాధిపతి వల్లవరాయుడు(కార్తీ) తో కలిసి రాష్ట్రకూట రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఆ తరువాత ఇతర దేశాలను దండెత్తి వెళుతూ ఉంటాడు. మరోపక్క  ఆదిత్య కరికాలుడు సోదరుడు అరుళ్ మొళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) శ్రీలంక దేశాన్ని వశం చేసుకోవడానికి తన నౌకాదళంతో దండెత్తి వెళతాడు.  

ఇలా  చోళ యువరాజులు ఇద్దరూ రెండు వేరువేరు దిక్కులకు ఇతర రాజ్యాలను చేజిక్కించుకోవడం కోసం వెళితే వారి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం వారి పినతండ్రి కుమారుడు మధురాంతకుడు(రెహమాన్). పెద్ద పడివేటి రాయుడు(శరత్ కుమార్) చిన్న పెద్ద పడివేటి రాయుడు(పార్థిబన్) అలాగే ఇతర సామంత రాజులతో కలిసి కుట్ర పన్నుతాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు తాను ఎంతో నమ్మిన కార్తీని ఈ విషయాన్ని తన తండ్రి సుందర చోళుడు(ప్రకాష్ రాజ్)కి చెప్పి తన సోదరి కుందవై(త్రిష) సలహాతో ఆమె ఏం చెబితే అది చేయాలని పంపిస్తాడు. అలా కుందవై దగ్గరకు వెళ్లే క్రమంలో నందిని(ఐశ్వర్య రాయ్)తో కూడా వల్లవరాయుడుకి పరిచయమవుతుంది. ఆ తర్వాత కుందవై ఆజ్ఞ మేరకు వల్లవరాయుడు లంక వెళతాడు. లంక వెళ్లిన తర్వాత వల్లవరాయుడు ఏమి చేశాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా మొదటి భాగం కధ. 

విశ్లేషణ:
పొన్నియన్ సెల్వన్  అనేది కొత్తగా సృష్టించబడిన కథ కాదు. కల్కి కృష్ణమూర్తి ఆల్రెడీ రాసిన నవలను సినిమా రూపంగా తెరకెక్కించారు దర్శకుడు మణిరత్నం. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో సుహాసిని చెప్పిన విషయాలను బట్టి వీరి వివాహం కంటే ముందే మణిరత్నంకు ఈ సినిమా చేయాలనే కోరిక ఉండేది. అయితే టెక్నాలజీ తక్కువవడమో లేక బడ్జెట్ పరిమితుల వలనో తెలియదు కానీ ఎన్ని రోజులు ఆ డ్రీమ్ ప్రాజెక్టుని వాయిదా వేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు 2022లో ఆ సినిమాను గ్రాండ్ గా విడుదల చేశారు.  ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది అనడానికి లేదు. ఎందుకంటే సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దడానికి మణిరత్నం ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు.

సినిమా మొదలు మొదటి భాగం అంతా చాలా స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. రెండో భాగం లోకి ఎంటర్ అయిన తరువాత కథ కాస్త వేగం పుంజుకుంటుంది అనుకుంటున్న సమయంలో సినిమా సెకండ్ పార్ట్ మీద ఆసక్తి రేకెత్తించే విధంగా కొన్ని సీన్లు రాసుకున్నారు. మొదటి భాగం అంతా పాత్రల పరిచయానికే తీసుకున్నా ఇంకా రెండో భాగంలో కూడా ఇంకా పరిచయం చేయాల్సిన పాత్రలు మిగిలే ఉండడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

ఒక రకంగా ఈ కథ గురించి ముందే తెలిసిన వాళ్ళు తప్ప కొత్తవాళ్లు సినిమా అని అర్థం చేసుకోవడం కష్టమే. సాధారణ ప్రేక్షకులు అంత త్వరగా సినిమాను సినిమాలోని పాత్రలను అవగతం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. సినిమాలో పాత్రధారుల పేర్లు అన్నీ తమిళ పేర్లు కావడం వాటిని గుర్తు పెట్టుకోవడమే కాస్త కష్టంగా అనిపిస్తుంది. గతంలో ఈ కథ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం సినిమాకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది తమిళ నవల కావడం తమిళనాట రాజ్యమేలిన చోళులు, పాండ్యులకు సంబంధించిన కథ కావడంతో తెలుగువారికి ఈ సినిమా కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.

అయితే మణిరత్నం తాను చెప్పాలనుకున్న విషయాన్ని కాస్త డీటెయిల్డ్ గా చెప్పాలనే ఉద్దేశంతో లెంత్ పెరిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి భాగం సహా రెండో భాగంలో పాత్రల పరిచయానికే సమయం తీసుకున్న మణిరత్నం అసలు కథ అంతా సినిమా సెకండ్ పార్ట్ లో ఉంటుందనే విధంగా హింట్ ఇచ్చారు. ఒకరకంగా సినిమా నిడివి తగ్గి ఉంటే మరింత మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది. చోళులు-పాండ్యుల మధ్య యుద్ధం గురించి టచ్ చేయకుండా ఎక్కువ భాగం చోళుల అంతర్యుద్ధం గురించే చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా రెండు కొప్పుల మధ్య యుద్ధమే చోళుల పతనానికి నాంది అనేట్టుగా చూపారు. 

నటీనటులు:
నటీనటులు ఈ సినిమాలో కార్తీ తన పాత్రలో చెలరేగిపోయి నటించాడు. రాజ్యాన్ని కోల్పోయి మరో రాజు దగ్గర నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తూనే మహిళలు ఎవరు కనిపించినా వారిని ఫ్లర్ట్ చేస్తూ కనిపించే వ్యక్తిగా పూర్తి స్థాయి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. విక్రమ్ కూడా చెలరేగి నటించాడు. ప్రేమ విఫలమై యుద్ధ వీరుడిగా మారిన వ్యక్తిగా విక్రమ్ ఆకట్టుకున్నాడు. జయం రవి సినిమాలో సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో పొన్నియన్ సెల్వన్ కొంత వరకే పరిమితం అవుతారు. కనిపించిన మేరకు తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇక లేడీ లీడ్స్ విషయానికి వస్తే ఐశ్వర్యరా,య్ త్రిష ఇద్దరూ తమ అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  వారిద్దరిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అనేంతలో రాణుల పాత్రలో వారు ఒదిగిపోయారు. ఇద్దరూ ఒక ఫ్రేమ్ లో ఉండగా వారిలో ఎవరిని చూడాలో అర్ధం కానంత అందంగా వారు కనిపించరు. ఇక మిగతా పాత్రలలో కనిపించిన శరత్ కుమార్, పార్థీబన్, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ్ల, ప్రభు, జయరాం, విక్రమ్ ప్రభు వంటి వారు ఎవరికి వారే తమ నటనలోని అనుభవాన్ని రంగరించి సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరు కాక ఐశ్వర్య లక్ష్మి వంటి వారు కూడా తమదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అందరికంటే ఎక్కువ మార్కులు పడేది కార్తీకి అని చెప్పాలి. ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకడంతో పాటు నటించే అవకాశం ఉన్న పాత్రలో ఇమిడిపోయాడు.

టెక్నికల్ టీం:
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందు నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నప్పుడైనా కనెక్టివిటీ ఉంటుందనుకుంటే అది పొరపాటే. కేవలం తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించినట్లు అనిపిస్తుంది. తెలుగు పాటలకు లిరిక్స్ కూడా సరిగా కుదరలేదు అనుకుంటే సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా అనిపించలేదు. గతంలో ఇలానే తమిళ డబ్బింగ్ సినిమాల పాటలు తెలుగులో రెహమాన్ వి సూపర్ హిట్ అయ్యాయి.

కానీ ఇప్పుడు నేపద్య సంగీతం విషయంలో కూడా ఏఆర్ రెహమాన్ ను దృష్టిలో పెట్టుకుని వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుందని చెప్పక తప్పదు. ఇక యుద్ధ సన్నివేశాలలో సినిమాటోగ్రఫీ మాత్రం చాలా పేలవంగా అనిపిస్తుంది. కానీ మిగతా చోట్ల తన మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు. ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ట్రై చేశారు ఏమో తెలియదు కానీ గయుద్ధ సన్నివేశాలలో జిబిజి గందరగోళంలా సీన్లు అనిపిస్తాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంత అద్భుతంగా లేవు. నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ వాడిన అనుభూతి కలుగుతుంది. ఇక మొదటి భాగంలో ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. రెండో భాగంలో ఆయన పనితనం కనిపించింది.

ఫైనల్ గా చెప్పాలంటే
ఫైనల్ గా చెప్పాలంటే పొన్నియన్ సెల్వన్ సినిమా తమిళలకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు వారు కూడా స్టార్ కాస్టింగ్ అంతా ఒకసారి చూడాలనుకుంటే చూడవచ్చు. పాత్రలు పేర్లు కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించినా ఈ పండుగ సీజన్లో సినిమా వన్ టైం వాచబుల్.

రేటింగ్ :2.25/5

Also Read: Brahmastra Updates: 'బ్రహ్మాస్త్ర 2' లో హృతిక్‌...రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన అయాన్

Also Read: పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలినా.. తెలుగులో మెగా సర్ప్రయిజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News