Akhil in Salaar Part 2: ప్రభాస్ సలార్ మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో.. మూవీటీమ్ మాంచి జోష్ లో ఉంది. ఇందులో భాగంగానే మంగళవారం (జనవరి 16) సలార్ సక్సెస్ మీట్ జరుపుకుంది. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్,  ప్రభాస్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో అఖిల్ అక్కినేని కనిపించడం కొత్త పుకార్లకు తావిచ్చింది. సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వంలో అఖిల్  కీ రోల్స్ పోషించబోతున్నాడనే వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో నిజమెంత?
సలార్ సెలబ్రేషన్స్ కు అఖిల్ హాజరవ్వడం చాలా మందిని  ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కడి నుంచే సలార్ సీక్వెల్లో అఖిల్ నటించబోతున్నాడన్న వార్తలకు ఊతమిచ్చంది. మరికొందరైతే దేవా తమ్ముడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా పుకారేనని సలార్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఓ వ్యక్తి తెలిపారు. ఇతర గెస్టులు లాగే అఖిల్ ను కూడా పిలిచారని.. అంతే తప్ప సలార్ సీక్వెల్ నటించబోతున్నాడన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. 


ఓటీటీలోకి వచ్చేది ఎప్పడంటే?
మరోవైపు సలార్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఈ నెల చివరిలో గానీ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో గానీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే లేదంటే ఫిబ్రవరి 4న ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత ఈ ఏడాది కల్కి 2898 ఏడీ, ది రాజాసాబ్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. 


Also Read: Tillu Square: అయోమయంలో సిద్దు జొన్నలగడ్డ... ఫిబ్రవరిలో కూడా టిల్లు స్క్వేర్ లేనట్టేనా


Also Read: Ananya Panday: హాట్ లుక్స్ తో కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్న లైగర్ బ్యూటీ, ఫోటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter