Akkineni Amala is Reason of Akhils Failures: అక్కినేని నట వారసుడిగా అఖిల్ హీరోగా ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. చిన్నప్పుడే సిసింద్రీ అనే సినిమాతో ఒకసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చిన ఈ అల్లరి పిడుగు అఖిల్ అనే సినిమాతో వివి వినాయక్ దర్శకత్వంలో లాంచ్ అయ్యాడు. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా ఎందుకో అఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక నిజానికి ఈ సినిమా వీవి వినాయక్ అక్కినేని ఫ్యామిలీ క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టినా ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత అఖిల్ చేసిన హలో సినిమా కూడా హీరోగా అఖిల్ ని అసలు ఏ మాత్రం నిలబెట్ట లేకపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్టర్ మజ్ను సినిమా అయితే పూర్తిస్థాయిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇలా మూడు సినిమాల తర్వాత అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం కొంత ఊరట ఇచ్చే విధంగా ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమాల తర్వాత ఈసారి పాన్ ఇండియా హీరోగా లాంచ్ అయిన అఖిల్ ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ మూటగటగుంది. అలా ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కాగా ఇప్పుడు భారీ డిజాస్టర్ గా కూడా నిలవబోతున్న సంగతి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


Also Read: Akhil Pooja Hegde Date : పూజా హెగ్డేతో డేటింగ్.. ఓపెన్ అయిన అఖిల్


అయితే అఖిల్ ఏజెంట్ సినిమాకి చేదు ఫలితం రావడం మీద సినీ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అక్కినేని అఖిల్ పరిస్థితి ఏమీ బాలేదని ఆయన ఎంత కష్టపడినా ఆయనకు ఫలితం దక్కదని ఆయన కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఒక మీడియా సంస్థ ఆయనను పలకరిస్తే అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని ఈ దోషం ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరి సలహాలు పాటించకూడదని వేణు స్వామి చెప్పుకొచ్చారు.


సాధారణంగా జాతకాల ప్రకారం మదర్ చంద్రుడికి తండ్రి సూర్యుడికి సంకేతమని అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అఖిల్ తల్లి అమల ప్రమేయం ఆయన జీవితానికి అసలు ఏమాత్రం కలిసి రాదని చెప్పుకొచ్చారు. ఇక ఈ మేరకు వేణు స్వామి అఖిల్ పతనానికి జాతకరీత్యా ఆయన తల్లే కారణం అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, నిజానికి వేణు స్వామికి సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా మంచి పేరు ఉంది. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన వంటి వారు ఆయన దగ్గర పూజలు చేయించుకుని తర్వాత ఉచ్చ స్థితికి వెళ్లడంతో ఆయన చెబుతున్నవన్నీ నిజమనే వ్యాఖ్యలు వినిపించాయి.


దానికి తోడు సమంతా నాగచైతన్య జాతకాన్ని బట్టి వారు ఎక్కువ రోజులు కలిసి ఉండ లేరని వారి వివాహం సమయంలోనే వేణు స్వామి చేసిన కామెంట్లు కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద అఖిల్ జాతకం గురించి వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అఖిల్ ఈ విషయం మీద సీరియస్గా తీసుకుని వేణు స్వామిని సంప్రదించి ఏమైనా పరిహారాలు చేసుకుంటాడో లేక వాటిని కొట్టిపారేసి తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.


Also Read: Pawan Kalyan OG : సెట్ నుంచి పవన్ కళ్యాణ్‌ ఫోటో.. మాటిస్తున్నామంటూ నిర్మాణ సంస్థ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook