Akkineni Fans Warning to Balakrishna: మా ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అంటున్నారు  అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వర రావు. తాజాగా సినిమా హీరో, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వీర సింహా రెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో వాళ్ళ నాన్నగారి ముందు వీళ్ళంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో స్టేజి మీద మాట్లాడటం తన అహంకారపూరిత అవలక్షణం గా భావించాల్సి వస్తుంది అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మద్రాసు లోనే అంతం అవకుండా మొట్ట మొదట హైదరాబాద్ కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతో మంది కి ఆర్టిస్ట్ లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ గారి అహంకారం మాటలు మేము ఖండిస్తున్నామని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.


మీ నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడుని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకి ఒక కొడుకుగా నెరవేర్చాలని లేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అంటూ మేము ప్రశ్నించవచ్చు, కానీ మా అక్కినేని ఫ్యాన్స్ కు ఆ సంస్కారం ఉందని అంటూ పరోక్షంగా చంద్రబాబు ప్రస్తావన కూడా లేఖలో తీసుకొచ్చారు.


కావున ఇక మీద మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని, లేనిచో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉందని అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు N.సర్వేశ్వరరావు ఒక లేఖ విడుదల చేశారు. మరి దీనికి నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 
Also Read: Bollywood Actors arrested: రష్మిక పేరుతో 20 లక్షల టోకరా..హైదరాబాద్లో బాలీవుడ్ నటీనటులు అరెస్ట్!


Also Read: Keerthy Suresh-Vijay: విజయ్ తో కీర్తి ప్రేమాయణం.. తమిళ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook