Keerthy Suresh-Vijay: విజయ్ తో కీర్తి ప్రేమాయణం.. తమిళ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Justice For Sangeetha: తమిళ సోషల్ మీడియాలో ఒక అర్ధం పర్ధం లేని సోషల్ మీడియా ట్రెండ్ మ్,మొదలైంది, అసలు ఏమాత్రం నిజం కాకున్నా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేసి రచ్చ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 24, 2023, 10:13 AM IST
Keerthy Suresh-Vijay: విజయ్ తో కీర్తి ప్రేమాయణం.. తమిళ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Keerthy Suresh Affair With Hero Vijay: సోషల్ మీడియా ట్రోలింగ్ విషయంలో తెలుగు సినీ ప్రేమికులు 1000 రేట్లు బెటర్ అనిపిస్తున్నారు.  ఎందుకంటే తమిళ సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే అలా అనిపించక మానదు. తాజాగా జస్టిస్ ఫర్ సంగీత అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ మొదలుపెట్టి అసలు ఏమాత్రం అర్థం పర్థం లేని ట్రోల్స్ చేస్తూ హీరో విజయ్ హీరోయిన్ కీర్తి సురేష్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఈ ట్రోలింగ్ కూడా తెరమీదకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

అసలు దీనంతటికీ కారణం తమిళ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక అర్థం లేని ప్రచారమే. తాజాగా తమిళంలో ఒక వెబ్సైట్ కథనం ప్రకారం విజయ్ ఏడు అక్షరాలు కలిగిన పేరు ఉన్న ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని ఆమెకు క్లోజ్ అవ్వ వద్దు అని విజయ్ భార్య కోరినా విజయ్ వినిపించుకోకుండా ఆమెకు క్లోజ్ అయ్యాడని సదరు కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ కు సదరు నటికీ మధ్య వారధిలా వ్యవహరిస్తున్న విజయ్ మేనేజర్ ను ఉద్యోగం నుంచి తీసేయమని విజయ్ భార్య అడిగితే ఉద్యోగం నుంచి తీసేయడం కాదు కదా అతనికి తమిళనాడులో ఒక ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కూడా కొనిపెట్టాడని అలాగే అతనికి కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి నిర్మాతను కూడా చేశారని, ఆయన నిర్మాణంలోనే సదరు హీరోయిన్ నటిస్తోందని అందుకే సంగీతకు విజయ్ కి మధ్య దూరం పెరిగిందని కథనంలో పేర్కొన్నారు.

ఈ నేపద్యంలోని విజయ్ గురించి తమ స్నేహితులకు బంధువులకు చెప్పడమే కాక అతని ఇంటికి కూడా రానివ్వకుండా పిల్లల్ని కూడా చూడ నివ్వకుండా ఆమె అడ్డుపడుతున్నారని సదరు కథనంలో పేర్కొన్నారు. అయితే తన పిల్లల్ని కూడా కలవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో తాను రాజకీయాల్లోకి వెళ్లాలంటే ఇవన్నీ ఇబ్బందిగా మారతాయని భావించి తన భార్యతో రాజీకి రావాలని విజయ్ భావించినట్లుగా సదరు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఈ కథనంలో ఇలా ఉండడంతో గతంలో విజయ్ తో భైరవ, సర్కార్ వంటి సినిమాల్లో నటించి ఇప్పుడు విజయ్ మేనేజర్ జగదీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న రివాల్వర్ రీటా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ విజయ్ తో ప్రేమలో ఉందనే వాదన తెరమీదకు వచ్చింది.

దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అర్థం వచ్చేలా ఉన్న ట్వీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు విజయ్ యాంటీ ఫాన్స్. ఇంకేముంది పెళ్లైన హీరోతో కీర్తి సురేష్ ప్రేమాయణం నడుపుతోందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందని ప్రచారం కూడా తెలుగు మీడియా వర్గాల్లో మొదలైంది. అయితే వీరి మధ్య ఏమీ లేదని విజయ్ అభిమానులు అయితే అంటున్నారు. ఇదంతా కావాలని యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం అని సంక్రాంతికి తమ సినిమా మంచి వసూళ్లు రాబట్టిన నేపథ్యంలోనే తమ హీరో ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వారు ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అనేది స్వయంగా విజయ్ క్లారిటీ ఇస్తే తప్ప ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. 

Also Read: Bollywood Actors arrested: రష్మిక పేరుతో 20 లక్షల టోకరా..హైదరాబాద్లో బాలీవుడ్ నటీనటులు అరెస్ట్!

Also Read: Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News