Naa Saami Ranga OTT: ఓటీటీలోకి నా సామిరంగ…ఎప్పుడు. ఎక్కడ అంటే !
Naa Saami Ranga: సంక్రాంతి సినిమాలు అన్నీ ఒక్కొక్కటి ఓటీటీలోకి రావడం ప్రారంభించాయి. ఇప్పటికే వెంకటేష్ సైంధవ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఇప్పుడు నాగార్జున నా సామిరంగా కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిపోయింది…
Naa Saami Ranga OTT Date: ఈ సంవత్సరం సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతోపాటు.. వెంకటేష్ సైంధవ, నాగార్జున నా సామిరంగా.. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ తరువాత నాగార్జున సినిమా నాసామిరంగా కలెక్షన్స్ పరంగా మంచి విజయం సాధించింది.
వరస ప్లాపులతో సతమతమవుతున్న నాగార్జునకి ఈ సినిమా కొంచెం ఉరట కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటి డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాతో విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం నెట్ఫ్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా వెంకటేష్ సైంధవ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూడడం ప్రారంభించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.
ఈ సినిమా ఈ నెల 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు అయిపోయింది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్. కాగా ఈ చిత్రంలో నాగార్జున కన్నా కూడా వరాలు పాత్రలో కనిపించిన ఆశిక ఎక్కువ పేరు సంపాదించుకుంది. అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ ఆశికా రంగనాథ్ ఈ చిత్రంతో మరింత చేరువయ్యింది. ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఆమె అని అంతేకాకుండా ఆమె వల్లే ఈ సినిమా మంచి విజయం సాధించగలిగిందని ఎంతోమంది క్రిటిక్స్ కూడా తెలియజేశారు. అంతేకాకుండా నాగార్జున తనకు బాగా అచ్చి వచ్చే సంక్రాంతి సెంటిమెంట్ ఫాలో అవ్వడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. మరి థియేటర్లో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.
'నా సామిరంగ' సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 'నా సామిరంగ' లో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించగా..అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ ముఖ్యపాత్రలో కనిపించారు.
ఈ సినిమాకు ఆస్కార్- అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఆకర్షణ అయ్యింది.
Also Read: Samudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook