Samudrika Shastra: సాముద్రిక శాస్త్రం ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. చేతి రేఖలు, నిర్మాణం, చిహ్నాలు మొదలైనవాటిని ఆధారంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ గుర్తులు మీకు మంచి లేదా చెడు అర్థాన్ని ఇవ్వచ్చు. వ్యక్తుల వేళ్లపై ఉన్న గోళ్లను చూసి వారి స్వభావం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మనం సాధారణంగా గోళ్లపై అర్ధచంద్రాకారం గుర్తు చూసే ఉంటాం. వాటి అర్థం ఏంటి? ఏ వేలుపై ఉంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది తెలుసుకుందాం.
బొటనవేలు..
సాముద్రిక శాస్త్రం ప్రకారం బొటనవేలు గోరు కింద చంద్రవంక ఉన్న వ్యక్తి ఒకసారి నిర్ణయం తీసుకుంటే కచ్ఛితంగా నెరవేరుస్తాడు. ఈ వ్యక్తులు ఏ పని చేపట్టినా పూర్తి అంకితభావంతో పూర్తి చేస్తారు. జీవితంలో ప్రతి భౌతిక సౌకర్యాన్ని పొందుతారు. ఈ వ్యక్తులు నాటకరంగంలో చాలా పేరు సంపాదిస్తారు.
చూపుడు వేలు...
సాముద్రిక శాస్త్రం ప్రకారం చూపుడు వేలు గోరుపై అర్ధచంద్రం ఉన్నవారు చాలా ఆత్మగౌరవంతో ఉంటారు. వాళ్లు ఎవరి సహాయం లేకుండా జీవితంలో ముందుకు సాగుతారు. ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. ఈ వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని పొందుతారు.
ఇదీ చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలతరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు..మొబైల్‌లో దర్శనం టిక్కెట్లు!
మధ్య వేలు..
సాముద్రిక శాస్త్రం ప్రకారం మధ్య వేలు గోరు కింద చంద్రవంక ఉన్న వ్యక్తి చాలా ధనవంతులు. అలాంటి వారికి అదృష్టం ఆలస్యంగా లభిస్తుంది. ఈ వ్యక్తులు చాలా సంపదను కలిగి ఉంటారు. అంతేకాదు వీళ్లు జీవితంలో చాలా విలాసవంతంగా గడుపుతారు. అనుకున్నవి కూడా సాధిస్తారు.
ఉంగరపు వేలు..
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉంగరపు వేలు గోరు కింద చంద్రవంక ఉన్న వ్యక్తి నిజాయితీ, ఆత్మగౌరవం కలవారు. అలాంటి వారు ఐఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పదవులు నిర్వహిస్తారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా ఈ వ్యక్తులు చాలా పేరు సంపాదిస్తారు.
చిటికెన వేలు..
సాముద్రిక శాస్త్రం ప్రకారం చిటికెన వేలుపై చంద్రవంక ఉన్న వ్యక్తి చాలా సృజనాత్మకంగా ఉంటారు. కష్టపడి పని చేస్తారు, కాబట్టి వారు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం, సంగీతం, యాంకరింగ్ మొదలైన రంగాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Samudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!