Thank You Movie Twitter Review: నాగచైతన్య థాంక్యూ సినిమా హిట్టా? ఫట్టా?

Thank You Movie Twitter Review: ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన థాంక్యు సినిమాలో నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాశి ఖన్నా అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం
Thank You Movie Twitter Review: వరుస సినిమాలతో హిట్లు కొట్టిన నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ మినహా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు కూడా ఈ సినిమాకు వేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాలో రాశి ఖన్నా అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
ఇక ఇప్పటికే చాలా చోట్ల సినిమా ప్రీమియర్స్ పడిపోయిన నేపథ్యంలో సినిమా ఎలా ఉందనే దానిమీద ఆడియన్స్ తమకు తోచిన విధంగా రివ్యూ ఇస్తున్నారు. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే రొటీన్ కథ అంటూ మరి కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎవరెవరు తమ అభిప్రాయాలను ఏ ఏ విధంగా వ్యక్తం చేశారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగ ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
సినిమాలో చైతన్య నటన అద్భుతంగా ఉందని, క్లాస్ అయినా మాస్ అయినా చింపేస్తాడని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చైతన్య పెర్ఫార్మెన్, విక్రమ్ కుమార్ టేకింగ్, పోకిరి కటౌట్ ట్విస్ట్, వైజాగ్ ఎపిసోడ్, థమన్ బీజీఎమ్ సహా జనాన్ని ఆకట్టుకుంటే రన్ టైం సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు.
అలాగే చాలా మంది చైతన్య యాక్టింగ్ బాగుందని అంటున్నారు. రాశి ఖన్నా కంటే అవికా గోర్ కి నటనలో ప్రాధాన్యత దక్కిందని అంటున్నారు. ఇక సినిమా ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్ అని మరికొందరు అంటున్నారు.
మొత్తం మీద సినిమా టాక్ చూస్తుంటే చైతూ మరో హిట్ కొట్టాడు అని అనుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఫుల్ రివ్యూలు బయటకు వస్తే కానీ సినిమా ఎలా ఉందనేది తెలుస్తుంది.
Note: ఇవి కేవలం వీక్షకుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
Read Also: Siddhartha: ఆ హీరోయిన్ తో ప్రేమలో సిద్దూ.. ఫోటోలు తీసిన వారిపై సీరియస్
Read Also: Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.