Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసిన సమంత?

Samantha Ruthprabhu interesting Comments on Ranvir singh: సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో ఒక విషయాన్ని గుర్తించిన నెటిజన్లు దాని గురించి పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2022, 02:15 PM IST
  • కాఫీ విత్ కరణ్ షోలో మెరిసిన సమంత
  • రణవీర్ సింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్
  • కొత్త చర్చలు మొదలు
Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసిన సమంత?

Samantha Ruth Prabhu interesting Comments on Ranvir Singh: ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఒకదారి అనే ఒక సామెత తెలుగులో ఉండనే ఉంది. ఇప్పుడు ఈ సామెత సమంతకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు నెటిజన్లు. దానికి కారణం సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె కరణ్ జోహార్ టాక్ షోలో సందడి చేసింది. దానికి సంబంధించి ఒక ప్రోమో ఇప్పటికే విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే అందులో ఒక విషయాన్ని గుర్తించిన నెటిజన్లు దాని గురించి పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఆ విషయం ఏమిటంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతూ కరణ్ జోహార్ మీ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి ఒక ఇద్దరు బాలీవుడ్ హీరోలతో డాన్స్ చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలి అనుకుంటున్నావు అని అడిగారు. దానికి ఒకటి రణవీర్ సింగ్ రెండు కూడా రణవీర్ సింగ్ అంటూ దీపికా పడుకొనే భర్త మీద సమంత ఆసక్తి చూపించడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటికే తన భర్తకు విడాకులు ఇచ్చిన సమంత తన పక్కనే ఉన్న అక్షయ్ కుమార్ గురించి గానీ లేదా పెళ్లి కానీ ఇతర బాలీవుడ్ హీరోల గురించి గానీ చెబుతుందని అందరూ ఊహించారు. కానీ ఆమె మాత్రం దీపికా పడుకునే భర్త గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతేకాక కొంత మంది నెటిజన్లు అయితే పెళ్లి అయిన బాలీవుడ్ స్టార్ హీరో మీద సమంత కన్నేసింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే సమంత ప్రస్తుతానికి బాలీవుడ్ లో స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఆమె అక్కడ క్రేజ్ ఉన్న హీరోల గురించి ఇలా మాట్లాడుతూ ఉండి ఉండవచ్చని అంటున్నారు. మరికొందరైతే రణవీర్ సింగ్తో త్వరలోనే ఒక సినిమా చేయబోయే అవకాశాలు ఉన్నాయేమో బహుశా అందువల్లే ఈ విధంగా కాకా పడుతుందేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: TV Actress: పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి దుర్మరణం!

Read Also: Liger Trailer Review: విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News