Akshay Kumar's Bachchhan Paandey Official Trailer is Out: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'బచ్చన్ పాండే'. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వర్సి ప్రధాన పాత్రల్లో నటించారు. నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ సినిమా 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఇదే కథతో తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'గద్దల కొండ గణేష్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా ఆడని జిగర్తాండ హిందీ రీమేక్‌పై భారీగానే అంచనాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బచ్చన్ పాండే సినిమాను మార్చి 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే సినిమా పోస్టర్ విడుదల కాగా.. అందులో అక్షయ్ కుమార్ ఫెరోషియస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. కృతి సనన్ ఎంట్రీతో ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. 'బచ్చన్ పాండే ఎవరో తెలుసా.. అతడు ఓ కిల్లర్', 'నేను రావణుడిని.. దిళ్లు, దిమాక్ రెండు ఉన్నాయి', 'ఇది మె మె మె మెరిండా.. ఇది మ మ మ మాజా' 'చంపుతుంటే మస్త్ మజా వస్తది' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 


బచ్చన్ పాండే సినిమా ట్రైలర్‌లో అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా ఉన్నాడు. కామెడీ, యాక్షన్ సీన్లలో బాగా నటించాడు.  మరోవైపు అక్షయ్ పక్కన ఉండే గ్యాంగ్ కామెడి చేశారు. ఇక కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి కామెడి ప్లస్ అరాచకం కలగలిపిన ట్రైలర్‌ అని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే విడుదల అయిన ఈ ట్రైలర్‌ను ఇప్ప్పటికే 30 వేలకు మంది చూశారు. నెట్టింట ఈ ట్రైలర్‌ వైరల్ అయింది. 



తెలుగు సినిమా కథ ఆధారంగా.. ఓ లేడీ డైరెక్టర్ 'బచ్చన్ పాండే' రౌడీషీటర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకుంటుంది. అందుకోసం అతడిని స్వయంగా కలుస్తుంది. ఆమె తనతో పాటు ఓ స్నేహితుడిని కూడా తీసుకెళుతుంది. బచ్చన్ పాండేను ఒప్పించి అతడి బయోపిక్ తీయడానికి రెడీ అవుతుంది. అదే సమయంలో బచ్చన్ పాండే, అతడి దగ్గర పనిచేసే రౌడీల కారణంగా ఆమె కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇంతకు ఆమె సినిమా పూర్తి చేసిందా? తనను తాను ఆ రౌడీషీటర్ షీటర్ నుంచి ఎలా కాపాడుకుంది అనేదే సినిమా. 


Aslo Read: Video: దారినపోయే వాళ్లకు హీరోయిన్ ఫ్రీ హగ్స్.. మాకూ కావాలంటున్న నెటిజన్లు...


Also Read: Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు.. 38 మంది దోషులకు మరణ శిక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook