Akshay Kumar played volleyball with jawans - Watch Video| బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌లో జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడారు. ఆర్మీ డేను పురస్కరించుకొని శుక్రవారం అక్షయ్ కుమార్ సైనికులతో (Army) కలిసి సరదాగా గడిపారు. ఈ మేరకు అక్షయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. జ‌వాన్లు వేసుకున్న‌ మాదిరిగానే అక్షయ్ కుమార్ (Akshay Kumar ) కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని, తీవ్ర చలిలో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధైర్య‌వంతులైన జ‌వాన్ల‌ను క‌ల‌వ‌డం, ఆర్మీ డే (Army Day) సంద‌ర్భంగా మారథాన్‌ను ప్రారంభించ‌డం చాలా ఆనందంగా ఉందంటూ అక్షయ్ కుమార్ వీడియోతోపాటు రాశారు. వాలీబాల్ కంటే ఉత్త‌మ వామ్ అప్ గేమ్ ఏం ఉంటుంద‌ని ఆయన పేర్కొన్నారు. Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 


ప్రస్తుతం అక్ష‌య్ కుమార్.. ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బ‌చ్చ‌న్ పాండే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ న‌దియావాలా నిర్మిస్తుండగా.. అక్షయ్ సరసన.. కృతి స‌న‌న్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజ‌స్థాన్‌ (rajasthan) లో జరుగుతోంది. Also Read: Viral Video: మొసలిని బాగానే పట్టుకున్నారు.. ఆ తరువాతే పడరాని పాట్లు!


Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook