Ala Vaikunthapurramuloo Hindi Remake : ప్రస్తుత కాలంలో రీమేక్‌లు ఎంత ప్రమాదంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సీన్, షాట్, ఫ్రేమ్‌లో పోలికలు వెతుకుతున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలను వేరే భాషల్లో రీమేక్ చేయడం కత్తి మీద సాములా మారింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీ ఆల్రెడీ విడుదలవ్వాల్సింది. కానీ కర్ఓ్నా వల్ల వాయిదా పడుతూనే వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా విషయంలో అనేక వాగ్వాదాలు, వివాదాలు వచ్చాయి. బన్నీకి పుష్ప సినిమాతో మంచి క్రేజ్ రావడంతో.. అల వైకుంఠపురములో సినిమాను కూడా హిందీలో డబ్ చేసి వదిలేద్దామని అనుకున్నారు.కానీ కార్తీక్ ఆర్యాన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అలా గనుక ఇక్కడ రిలీజ్ చేస్తే ఈ సినిమాను ఇక నేను చేయను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడట. మొత్తానికి హిందీలో డబ్ చేయాలనే ఆలోచనను అంతా విరమించుకున్నారు.


 



ఇప్పుడు కార్తీక్ ఆర్యాన్ బర్త్ డే సందర్భంగా ఈ రీమేక్ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా టీజర్‌లోని ప్రతీ షాట్‌ను నెటిజన్లు ఒరిజినల్‌తో పోల్చుతున్నారు. అయితే ఒరిజినల్‌లో ఉన్న ఫీల్, బన్నీలోని స్టైల్, యాటిట్యూడ్, ఆ కొత్తదనం మాత్రం రీమేక్‌లో కనిపించడం లేదు. ఈ మేరకు నెటిజన్లు కూడా కార్తీక్ ఆర్యాన్‌ను చూసి పెదవి విరుస్తున్నారు. అసలు రీమేక్ చేయకుండా ఉండాల్సింది కదా? అంటూ సలహాలు ఇస్తున్నారు.


సిత్తరాల సిరపడు టైంలో వచ్చిన సీన్లను రీమేక్‌లో రైల్వే స్టేషన్‌లో పెట్టినట్టు కనిపిస్తోంది. ఇంట్లోకి మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చే సీన్‌లోనూ అంత ఎఫెక్టివ్‌గా చూపించినట్టు అనిపించడం లేదు. ఇక ఫస్ట్ ఫైట్‌ తెలుగులో ఎంత స్టైలీష్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పోర్ట్ ఏరియాలో ఉండే ఫైట్‌ను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా తీసినట్టు కనిపిస్తోంది. ఇక హీరోయిన్‌, హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం అంతగా కుదిరినట్టు అనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద మైనస్‌లా కనిపిస్తోంది. మరి ఈ సినిమాను అక్కడి జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.


Also Read : Avatar The Way Of Water టికెట్ రేట్లు.. జేబులు గుల్ల అవ్వాల్సిందేనా?


Also Read : Keerthy Suresh pics : 8వ శతాబ్దం నాటి పురాతన గుడిలో మహానటి.. కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉందో.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook