Keerthy Suresh pics : 8వ శతాబ్దం నాటి పురాతన గుడిలో మహానటి.. కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉందో.. పిక్స్ వైరల్

  • Nov 22, 2022, 16:57 PM IST
1 /5

మహా నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సౌత్ క్రేజీ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ముందు వరుసలో ఉంటుంది.

2 /5

మహానటి సినిమాలో తన నటనతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే మహానటి తరువాత మళ్లీ ఆరేంజ్ పాత్ర ఆమెకు పడలేదు. ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలో పడలేదు.  

3 /5

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కీర్తి సురేష్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కానీ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

4 /5

కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన వర్కవుట్లు, పర్సనల్ విషయాలు, తన పెట్ నైక్‌కు సంబంధించిన విషయాలన్నీ చెబుతుంటుంది.

5 /5

కీర్తి సురేష్‌ తాజాగా తన సొంతూరిలోని ప్రాచీన దేవాలయం, తన పురాతన ఇంటికి వెళ్లిందట. ఈ మేరకు అక్కడి గుడిలో ఇలా సింపుల్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.