Alia Bhatt discharged and returns home with her baby girl: బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ రణబీర్ కపూర్‌లతో పాటు, ఇప్పుడు వారి లిటిల్ ఏంజెల్ కూడా కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు అలియా భట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రణబీర్-ఆలియా ఆసుపత్రి నుండి బిడ్డతో ఇంటికి బయలుదేరారు. అలియా- రణబీర్ కుమార్తె ఎలా ఉంటుంది? ఆమెకు తల్లి పోలిక వచ్చిందా? లేక తండ్రి పోలిక వచ్చిందా? అని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అభిమానులకు అప్పుడే అలియా కుమార్తె ఫోటోలు అయితే ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. ఆసుపత్రి నుండి బయటకు వెళ్లేటప్పుడు తమ కుమార్తె ముఖం ఎవరికీ చూపించకూడదని అలియా భట్ - రణబీర్ నిర్ణయించుకున్నారు. అందుకే వారు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.  గిర్‌గావ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్ నుంచి అలియా భట్ గురువారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె తన బిడ్డ కుమార్తెతో ఆసుపత్రి నుండి బయలుదేరినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి.


ఈ జంట నవంబర్ 6న ఒక చిన్నారికి జన్మనిచ్చింది. అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరవగా సైలెంట్ గా పెళ్లి వేడుక జరిగింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ సమయంలోనే అలియా, రణబీర్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని టాక్. ఇక అలియా-రణ్‌బీర్‌ జంటగా నటించిన తొలి చిత్రం 'బ్రహ్మాస్త్ర' సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


అలియా భట్ సినిమాల గురించి చెప్పాలంటే ఆమె త్వరలో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతోంది. రణబీర్ - అలియాల కారు ఆసుపత్రి నుండి బయలుదేరిన ఫోటోలు బయటకు వచ్చాయి, ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ - అలియా బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారులో తమ కుమార్తెతో ఆసుపత్రి నుండి బయలుదేరారు. ఇక మరోపక్క లిటిల్ ఏంజెల్‌కు స్వాగతం పలికేందుకు కపూర్ కుటుంబంలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.



Also Read: Harihara Veeramallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. ఇక రచ్చ రచ్చే!


Also Read: Ram Charan for Velpari: నక్కతోక తొక్కిన రామ్ చరణ్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీలక పాత్ర?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook