Ram Charan for Velpari: నక్కతోక తొక్కిన రామ్ చరణ్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీలక పాత్ర?

Ram Charan for Velpari Project: రామ్ చరణ్ ను తాను వేల్పరి నవలను ఆధారంగా చేసుకుని చేసే మూవీలో కూడా తీసుకునేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 9, 2022, 07:33 PM IST
Ram Charan for Velpari: నక్కతోక తొక్కిన రామ్ చరణ్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీలక పాత్ర?

Shankar to rope in Ram Charan for Velpari Project: సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతానికి ఒకపక్క రాంచరణ్ తో మరొక కమల్ హాసన్ తో సినిమాలు చేస్తున్నారు. వాస్తవానికి కమల్ హాసన్ తో ఇండియన్ 2 అనే సినిమాని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్లాన్ చేశారు. ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా దీన్ని ప్లాన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా జరుగుతూ ఉండగానే ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుని కొంతమంది టెక్నీషియన్లు కూడా చనిపోయారు.

ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఆ తర్వాత కమలహాసన్ శంకర్ మధ్య దూరం పెరగడంతో కమల్ హాసన్ ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు లేవని భావించిన శంకర్ దిల్ రాజుతో కలిసి రాంచరణ్ 15వ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో పాటు రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ వచ్చారు. అయితే శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమా పక్కన పెట్టి లైకా ప్రొడక్షన్స్ కమల్ హాసన్ తో సయోధ్య కుదిర్చిన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు.

అయితే మరోపక్క రాంచరణ్ తో సినిమా ప్రకటించిన సమయంలో శంకర్ బాలీవుడ్ లో అపరిచితుడు సినిమాని రణవీర్ సింగ్ తో కలిసి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడం కంటే కొత్త ప్రాజెక్ట్ చేయడం మేలని భావించిన ఆయన తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేల్పరి అనే నవల ఆధారంగా ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా మరో కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

శంకర్ కావాలనే సినిమా పక్కన పెట్టి ఇండియన్ టు పూర్తి చేస్తున్నాడని భావిస్తూ బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా మరో పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ ని తీసుకోబోతున్నాడు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగానే శంకర్ రామ్ చరణ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. కానీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే జరుగుతోంది.

Also Read: Sunny Leone’s Photo: టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నీ హాట్ ఫోటో.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Also Read: Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ వేసేందుకు రెడీ.. రంగంలోకి దిగబోతోన్న ఆది సాయికుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News