Alia Bhatt Daughter Name : అలియా భట్ కూతురు పేరు ఏంటంటే?.. ఏ ఏ భాషలో ఏ ఏ అర్థమంటే?

Alia Bhatt Daughter Name అలియా భట్ రణ్‌బీర్ కపూర్లకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లికి, తల్లి అవ్వడానికి మూడు నాలుగు నెలలే గ్యాప్ రావడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. అదెలా ఉన్న ఇప్పుడు అలియా భట్ తన కూతురికి పెట్టిన పేరు వైరల్ అవుతోంది.
Alia Bhatt Daughter Name Raha Meanings : అలియా భట్ రణ్‌బీర్ కపూర్‌లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో వివాహాం జరిగినా కూడా నవంబర్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అలియా భట్. అంటే పెళ్లికి ముందే అలియా భట్ గర్భం దాల్చిందని అందరికీ అర్థమైంది. అప్పట్లో ఈ రూమర్ వచ్చింది కానీ.. అది ఒట్టి గాలి వార్తలే అని కొట్టిపారేశారు. కానీ నవంబర్ 6న అలియా భట్ తనకు పండంటి బిడ్డ పుట్టిందని చెప్పడంతో నాటి గాలి వార్తలే నేడు నిజమని అంతా నమ్మాల్సి వచ్చింది.
ఇప్పుడు అలియా భట్ తన కూతురికి ఏ పేరు పెట్టిందో చెప్పుకొచ్చింది. తన కూతురికి ఆ పేరును సజెస్ట్ చేసింది రణ్‌బీర్ కపూరేనట. ఈ విషయాన్ని అలియా ప్రకటిస్తూ.. తన కూతురి పేరుకి ఏ ఏ భాషల్లో ఏ ఏ అర్థాలున్నాయో చెప్పేసింది. తన కూతురు పేరు రాహా అని చెబుతూ వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
భక్తి మార్గంలో నడిచే వ్యక్తి అని.. స్వాహిల్ భాషలో సంతోషం అని, సంస్కృతంలో వంశం, కుటుంబ సమూహం అని అర్థం. బంగ్లా భాషలో అయితే సంతోషాన్ని, విరామాన్ని ఇచ్చేది.. అందరినీ బాగా చూసుకునేదని అర్థం. అరబిక్ భాషలో అయితే పీస్ (ప్రశాంతత) అని అర్థం. అంతే కాకుండా రాహా అంటే.. సంతోషం, స్వేచ్చ, ఆనందం ఇలా ఎన్నెన్నో అర్థాలున్నాయట.
తను పేరుకు తగ్గట్టే ఉంది.. ఎందుకంటే మేం తనను ముట్టుకున్న మొదటి క్షణంలో మాకు ఈ ఫీలింగ్స్ అన్నీ కలిగాయ్.. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ప్రాణాన్ని నింపినందుకు థాంక్స్ రాహా.. ఇక ఇప్పుడే మా జీవితాలు మొదలయ్యాయ్ అని అనిపిస్తోంది అంటూ అలియా భట్ ఎమోషనల్ అయింది.
బ్రహ్మాస్త్ర సినిమాతో అలియా, రణ్‌బీర్ జోడి బాగానే ఆకట్టుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌కు బ్రహ్మాస్త్ర ఊపరి పోసినట్టు అయింది. అయితే పెట్టిన బడ్జెట్‌కు వచ్చిన మొత్తానికి తేడా ఎక్కువగానే ఉంది. ఆ లెక్కల్లో చూసుకుంటే బ్రహ్మాస్త్ర మరీ గొప్ప చిత్రమేమీ కాదనిపిస్తుంది. ఇక రెండో పార్ట్ మీద మాత్రం అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. అందులో ఈ ఇద్దరూ ఉంటారా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Nandamuri Balakrishna Vs Chiranjeevi : నిన్ను తాకే దమ్మునొడు లేనే లేడయ్యా.. బాలయ్యపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కామెంట్స్.. మండిపడ్డ మెగా ఫ్యాన్స్
Also Read : Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook