Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్

Love Today Telugu Movie Review ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం లవ్ టుడే. తమిళ నాట విడుదలై సంచలనంగా మారిన ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి వదిలేశారు. ఈ లవ్ టుడే తెలుగు వారిని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 11:41 PM IST
  • కోలీవుడ్‌లో లవ్ టుడే సంచలనం
  • తెలుగులోకి వచ్చిన లవ్ టుడే
  • మెప్పించిన హీరో కమ్ దర్శకుడు
Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్

Love Today Telugu Movie Review : ప్రస్తుతం ఎక్కడ మంచి చిత్రం వచ్చినా అది ఏ భాషలో వచ్చినా కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాంతారా మొదట కన్నడలో రిలీజ్ అయినా కూడా నేషనల్ వైడ్‌గా సత్తా చాటింది. ఇప్పుడు తమిళంలో లవ్ టుడే అనే సినిమా సత్తా చాటుతోంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి వదిలేశారు. నేడు (నవంబర్ 25) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగు ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో ఓ సారి చూద్దాం.

కథ
ప్రదీప్ ఉత్తమన్ (ప్రదీప్ రంగనాథన్‌) నిఖిత (ఇవానా) ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నామనే భ్రమలో ఉంటారు. పెళ్లికి ఇవానా తండ్రి వేణు శాస్త్రి (సత్య రాజ్) ఓ కండీషన్ పెడతాడు. ఇద్దరూ తమ తమ ఫోన్‌లు మార్చుకుని ఒక రోజు ఉండండి.. ఆ తరువాత కూడా పెళ్లికి ఓకే అంటే తనకేమీ అభ్యంతరం లేదని వేణు శాస్త్రి చెబుతాడు. దీంతో ప్రదీప్, నిఖితలు ఆ నిబంధనకు ఒప్పుకుంటారు. ఆ తరువాత ప్రదీప్, నిఖితల మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? వారి వారి నిజ స్వరూపాలు ఎలా బయటపడ్డాయి? ఆ తరువాత ఏం జరిగింది? అసలు చివరకు నిఖిత, ప్రదీప్ ఒక్కటయ్యారా? వారి ప్రేమను నిలబెట్టుకున్నారా? అన్నది కథ.

నటీనటులు
ప్రదీప్ పాత్రలో ప్రదీప్ చక్కగా నటించాడు. ఓ సాదాసీదా అబ్బాయిగా సహజంగా నటించాడు. కథలోనూ ఎక్కడ హీరోయిజం, ఎలివేషన్లు పెట్టుకోలేదు. కథకు తగ్గట్టుగా ఎంతో నాచురల్‌గా నటించేశాడు. ఇక హీరోయిన్ ఇవానా నిఖిత పాత్రలో చక్కగా నటించడమే కాకుండా.. అందంగా కనిపించింది. యూత్‌కు ఇవానా బాగానే నచ్చుతుంది. సత్యరాజ్, రాధికలు తమ అనుభవంతో ఆ పాత్రలను అవలీలగా చేసేశారు. యోగిబాబు రొటీన్‌కు భిన్నంగా కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. నవ్వించేశాడు. అదే సమయంలో ఆలోచింపజేశాడు. హీరో ఫ్రెండ్స్ కారెక్టర్స్ కూడా బాగానే పండాయి. ఇలా అన్ని పాత్రలు తమ పరిధి మేరకు చక్కగా మెప్పించారు.

 

విశ్లేషణ
ప్రస్తుతం యువత ఎలా ఉంది.. ప్రేమ అంటే వారి దృష్టిలో ఏంటి.. యువత ఫోన్‌కు ఎంతలా బానిస అయింది.. ఫోన్‌ను ఎలా వాడుతున్నారు.. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి?.. సోషల్ మీడియా వాడకం ఎలా ఉంటోంది.. సోషల్ మీడియాలో చెడు ఎలా వ్యాప్తి చెందుతోంది.. ఇలా ఎన్నెన్నో పాయింట్లను టచ్ చేస్తూ రాసుకున్న కథ, అల్లుకున్న కథ ఎంతో చక్కగా అనిపిస్తుంది. యువతకు సెటైర్ వేస్తూనే అనిపిస్తూ.. నవ్వించేశాడు దర్శకుడు కమ్ హీరో ప్రదీప్. 

ఒక ఫోన్‌లోనే మనిషి జీవితం, నిజ స్వరూపం ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. మనిషి ముసుగు తొలిగిపోవాలంటే అతడి ఫోన్ ఒకటి చాలు అని పరోక్షంగా చెప్పేశాడు. ఇది అందరికీ రిలేట్ అయ్యే స్టోరీలానే అనిపిస్తుంది. ఫోన్‌ను వాడే ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా? అనే అనుకుని ఉంటారు. ఇప్పుడున్న యువత సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు? సైబర్ నేరాల మీద లైట్‌గా టచ్ చేశాడు. ఇలా కథ, కథనం అంతా కూడా నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఉంటుంది. అందుకే టైటిల్ కూడా లవ్ టుడే అని పెట్టినట్టున్నాడు.

ఇక లవ్ టుడేలోని ఎంత ఫన్ ఉంటుందో.. అంతే స్థాయిలో ఎమోషన్స్ ఉంటాయి.. అంతే స్థాయిలో సందేశం కూడా ఉంటుంది. డైలాగ్స్ మాత్రం ఆలోచింపజేసేలా ఉంటాయి. విత్తనం నాటితే.. పదే పదే తవ్వి చూడాల్సిన పని లేదు.. మొలకెత్తుతుందనే విశ్వాసం ఉండాలి. నమ్మకం ఉండాలి.. ప్రేమ ఉంటే.. ప్రతీది తవ్వి తవ్వి చూడాల్సిన పని లేదు.. నమ్మకం ఉంటే ప్రేమ పెరుగుతూనే ఉంటుందనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పే డైలాగ్ బాగుంటుంది. 

చెప్పడం లేదు అని అంటే... మీరు తెలుసుకోకూడదు అని.. తప్పు చేశారు అని కాదు.. అంటూ యోగిబాబు పాత్రతో చెప్పిన ఓ డైలాగ్ బాగానే అనిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్లు అప్పుడూ ఇప్పుడూ విడిపోతూ ఉన్నారు.. అప్పుడు పెద్దల వల్ల విడిపోయారు.. ఇప్పుడు మీది మీరే విడిపోతోన్నారు.. అంటూ సత్య రాజ్ చెప్పిన ఓ డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇలా మాటలు, పాటలు అన్నీ కూడా బాగున్నాయి. అయితే డబ్బింగ్ సినిమా పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంటుందో మరోసారి నిరూపించారు. తెలుగు టైటిల్స్ పట్ల కూడా శ్రద్ద పెట్టకుండా డబ్బింగ్ చేసి వదిలేసినట్టుగా అనిపించింది. ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని డిపార్ట్మెంట్ల పనితనం తెరపై మంచి రిజల్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

రేటింగ్ : 3

బాటమ్ లైన్ : లవ్ టుడే.. చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ డే

Also Read : Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్

Also Read : Kantara OTT Release: గుడ్‌న్యూస్, అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన కాంతారా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News