COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Alia Bhatt Shares Babybump Photos: బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అలియా భట్ తన తండ్రి బాటలోనే సినీ రంగ ప్రవేశం చేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. రణబీర్ కపూర్ తో చాలా రోజులపాటు ప్రేమాయణం నడిపిన ఈ భామ ఎట్టకేలకు అతనిని వివాహం చేసుకొని ఈ మధ్యనే తాను గర్భవతి అయినట్లు కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరి వివాహం జరిగిన తేదీకి తాను గర్భవతిని ఆమె ప్రకటించిన తేదీకి పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో ఆ విషయం మీద కూడా కొంతమంది రకరకాల కామెంట్లు చేశారు. 


కానీ అవన్నీ పట్టించుకోకుండా ఒకపక్క రణబీర్ కపూర్ మరియు పక్క ఆలియా భట్ కూడా తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా గర్భవతి అయి ఉండి కూడా అలియా భట్ ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అలియా భట్ హిందీ సినిమాలు చేస్తూనే మరోపక్క హాలీవుడ్‌ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అలియా భట్ తన మొదటి హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. తాజాగా షూట్ లొకేషన్లో అలియా భట్ ఆ సినిమాలో తనతో నటిస్తున్న వండర్ వుమెన్ గాల్ గాడోట్‌తో ఉన్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలలో బేబీ బంప్ కూడా కనిపిస్తోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 


ఈ సినిమా ఆలియాకు తొలి హాలీవుడ్ చిత్రంగా నిలవనుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అలియా తన వర్క్ కమిట్‌మెంట్ కారణంగా ఇచ్చిన డేట్స్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూట్ కోసం ఆమె లండన్‌లో ఉందని, ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఆమె త్వరలో ముంబైకి తిరిగి రాబోతోందని అంటున్నారు. అలియా భట్ తన తాజా ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ ఫీలింగ్‌పై మాట్లాడుతూ,  మాట్లాడుతూ ఇంతకంటే మంచి అనుభూతి లేదని, దానిని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. 


Also Read: Eesha Rebba: చొక్కా బొత్తాలు విప్పేసి టీజ్ చేస్తున్న తెలుగమ్మాయి.. ఎద అందాలతో అదరకొడుతున్న ఈషా రెబ్బ


Also Read: Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ షో.. అంతా కనపడేలా వీధుల్లో చక్కర్లు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.