Alia Bhatt - Ranbir Kapoor: అలియా భట్.. రణ్‌బీర్ కపూర్ ఏమైనా తాగి ఉన్నాడా?
డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకువెళ్లే సమయంలో అభిమానులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్లను చుట్టుముట్టారు. సెక్యూరిటీ వారిని క్లియర్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు.
Alia Bhatt went dinner date with Ranbir Kapoor: బాలీవుడ్ ప్రేమ జంటల్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ (Alia Bhatt - Ranbir Kapoor) ఒకటి. వీరి పెళ్లి కోసం బాలీవుడ్ పెద్దలతో పాటు అందరూ ఎదురుచూస్తునారు. లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లు ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దాంతో రణ్‌బీర్-అలియా (Alia - Ranbir) ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారాని అందరూ వారిని ఆడుగుతున్నారు. వీరిద్దరి పెళ్లి అంటూ గతేడాది నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నా.. వివాహ ముహుర్తం మాత్రం ఫిక్స్ అవ్వడం లేదు. డిసెంబర్‌లో పెళ్లి అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారుగానే మిగిపోయింది. వచ్చే ఏడాది అయినా వీరు పెళ్లిపీటలు ఎక్కుతారేమో చూడాలి.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ (Alia Bhatt - Ranbir Kapoor) తమ సినిమాలతో బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికినప్పుడు జంటగా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్, పార్టీ, పెళ్లిళ్లకు జంటగా హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం (డిసెంబర్ 23) సాయంత్రం ముంబై జుహూలోని ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడం కోసం రణ్‌బీర్, అలియాలు వెళ్లారు. వీరితో పాటు అలియా సోదరి షాహీన్ భట్, తన స్నేహితులు (అనుష్క రంజన్, ఆకాంక్ష రంజన్, మేఘనా గోయల్) కూడా ఉన్నారు. రెస్టారెంట్‌లో అందరూ కలిసి భోజనం (Dinner Date) చేసి చాలా సమయం గడిపారు.
Also Read: Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్!!
డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకువెళ్లే సమయంలో అభిమానులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ (Alia Bhatt - Ranbir Kapoor)లను చుట్టుముట్టారు. సెక్యూరిటీ వారిని క్లియర్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. అప్పుడు అలియాను రణ్‌బీర్ సురక్షితంగా కారు దాకా తీసుకెళ్లాడు. అలియాను కారు ఎక్కించిన రణ్‌బీర్.. తాను కూడా అదే కారు ఎక్కి వెళ్లిపోయాడు. రణ్‌బీర్ బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్‌తో కనపించగా.. పసుపు రంగు డ్రెస్‌లో అలియా అందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు (Netizens) కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అలియా.. రణ్‌బీర్ ఏమైనా తాగి ఉన్నాడా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అలియా మాస్క్ పెట్టుకోవా?' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్- సెన్సెక్స్ 191 మైనస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook