Vijay Deverkonda Puri Jagannadh another Movie: టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. 'లైగర్' విడుదలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మరో కొత్త మిషన్ లాంచ్‌కి అంతా సిద్ధమైంది.. విధ్వంసకర కాంబినేషన్.. మార్చి 29, మధ్యాహ్నం 2.20గంటలకు మిషన్ లాంచ్..' అని పూరి జగన్నాథ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. ఇదే పోస్టర్‌ను విజయ్ దేవరకొండ, చార్మి తమ ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాల్లో షేర్ చేశారు. ఆ పోస్టర్‌ని బట్టి చూస్తే... వైమానిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. బహుశా వార్ డ్రామాగా ఈ సినిమా ఉండొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న 'జన గణ మన' ప్రాజెక్ట్ ఇదే అయి ఉండొచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ ఏంటనేది చెప్పకుండా పూరి, విజయ్ అందరినీ సస్పెన్స్‌లో పెట్టారు. మరికొద్ది గంటలు ఆగితే గానీ ఈ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై పూర్తి క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న లైగర్‌ను పూరి జగన్నాథ్-కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 



 


Also Read: Yadadri Temple Inauguration: చిన్న జీయర్‌కు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..? అందుకే ఆహ్వానం పంపలేదా..!


Also Read: Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


 Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook