Ananya Pande: వామ్మో.. ఇదేం ఎక్స్‌పోజింగ్.. బర్త్ డే పార్టీలో విజయ్‌ దేవరకొండతో అనన్య హల్‌చల్..

Ananya Pande Latest Video: ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలిసి హల్‌చల్ చేసింది. అనన్య ధరించిన డ్రెస్ అందరినీ సర్‌ప్రైజ్‌కి గురిచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 02:54 PM IST
  • ముంబైలో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీ
  • పార్టీలో లైగర్ టీమ్ సందడి
  • బ్లాక్ డ్రెస్‌లో హల్ చల్ చేసిన హీరోయిన్ అనన్య పాండే
 Ananya Pande: వామ్మో.. ఇదేం ఎక్స్‌పోజింగ్.. బర్త్ డే పార్టీలో విజయ్‌ దేవరకొండతో అనన్య హల్‌చల్..

Ananya Pande Latest Video: ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో 'లైగర్' టీమ్ సందడి చేసింది. టీమ్ మొత్తం ఔట్ అండ్ ఔట్ బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ అనన్య పాండే పార్టీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అనన్య ధరించిన డ్రెస్ అందరినీ సర్‌ప్రైజ్‌కి గురిచేసింది. పార్టీలో అనన్య పాండే-విజయ్ దేవరకొండ మధ్య చిట్‌చాట్‌ని నిర్మాత చార్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'మై స్టన్నింగ్ లైగర్ కపుల్.. ఐలవ్యూ బోత్..' అంటూ ఆ వీడియోను షేర్ చేసింది.

'విజయ్ మాట్లాడుతున్న ఈ హాట్ బేబీ ఎవరు... ఎవరీ బ్యూటీఫుల్ గర్ల్..' అంటూ చార్మి మాట్లాడటం ఆ వీడియోలో గమనించవచ్చు. వెంటనే అనన్య చార్మి కెమెరా వైపు తిరిగి స్మైల్ ఇచ్చింది. బ్లాక్ నెట్ డ్రెస్‌లో పార్టీలో హల్‌చల్ చేసిన అనన్య ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనన్య డ్రెస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది.. ఓ మై గాడ్.. వాట్ ఏ హాట్ బేబీ అంటూ కామెంట్ చేశారు. మరికొందరు ఫ్యాషన్ డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు. అపూర్వ మెహతా బర్త్ డే పార్టీకి లైగర్ టీమ్‌తో పాటు హీరోయిన్లు కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, హీరో విక్కీ కౌశల్ తదితరులు హాజరయ్యారు.

కాగా, ప్రస్తుతం అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, అలీ, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమా ద్వారా తొలిసారి ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్నాడు. గత నెలలోనే ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

 

Also Read: Pegasus Spyware: చిక్కుల్లో చంద్రబాబు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.. పెగాసస్ కొనుగోలు చేశారా?

Also read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News