KBC 12: సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం, ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా
టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ పాపులర్ షోగా ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా క్రోర్ పతి మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతా సిద్ధమైన షో..సెప్టెంబర్ 28 నుంచి ప్రసారం కానుంది.
టెలివిజన్ స్క్రీన్ ( on Television screen ) పై మోస్ట్ పాపులర్ షోగా ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా క్రోర్ పతి ( kaun banega crorepati ) మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతా సిద్ధమైన షో..సెప్టెంబర్ 28 నుంచి ప్రసారం కానుంది.
కౌన్ బనేగా క్రోర్ పతి లేదా కేబీసీ ( KBC ) అంటే చాలు టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. అంతగా ఆసక్తి కల్గించిన షో ఏకంగా రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. ఇప్పటికి 11 సీజన్ లు పూర్తి చేసుకుని...పన్నెండవ సీజన్ ( KBC Season 12 ) ప్రారంభానికి అంతా సిద్ధం చేసింది సోనీ టెలివిజన్. బాలీవుడ్ బాద్ షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Big B Amitabh bachan ) అంటేనే కేబీసీ గుర్తొస్తుంది. అంతలా పాపులర్ షోకు పాపులర్ హోస్ట్ గా మొదట్నించీ ఆయనే ఉన్నారు. కరోనా వైరస్ నుంచి ఇటీవలే బయటపడిన అమితాబ్ బచ్చన్..కేబీసీ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 నుంచి రాత్రి 9 గంటలకు కేబీసీ సీజన్ 12 ప్రసారం కానుంది.
కోవిడ్ 19 ( Covid 19 ) నేపధ్యంలో తొలిసారిగా లైవ్ ఆడియన్స్ లేకుండా ( KBC without Audience ) షో ప్రసారం కాబోతోంది. ఆరోగ్య కారణంగా దృష్ట్యా ఆడియన్స్ ను ఈసారి షోలో భాగస్వామ్యం చేయలేదు. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగానే షో ప్రసారం కాబోతుంది. కేబీసీ 12 షూటింగ్ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని..తక్కువ మంది సాంకేతిక నిపుణులతో షూటింగ్ పూర్తి చేసినట్టు సోనీ యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా కేబీసీ సెట్‌కు పోటీదారులు చేరుకునే ముందే వారిని హోటల్‌లో క్వారంటైన్‌కు తరలించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతే సెట్‌కు తిరిగి తీసుకొచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు. Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్