Sarkaru Vaari Paata Movie collects 103 plus crores gross worldwide: గురువారం (మే 12) విడుదలైన 'సర్కారు వారి పాట' సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో  టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఎస్‌వీపీ చిత్రంకు పాజిటివ్ టాక్‌ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది.  మహేశ్ స్వాగ్‌ను వెండితెరపై ఆస్వాదించేందుకు సినీ ప్రియులు థియేటర్లకు బారులు తీరడంతో.. ఎస్‌వీపీ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సర్కారు వారి పాట' చిత్రం రెండు రోజుల్లోనే రూ. 103 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా కొద్దిసేపటి క్రితం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 'ఈ వేసవి సూపర్‌స్టార్ స్వాగ్ సీజన్' అని కాప్షన్ ఇచ్చింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు అని కూడా పోస్టర్‌లో పేర్కొంది. మొత్తానికి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రూ. 48.27 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. 


యూఎస్‌లోనూ 'సర్కారు వారి పాట' సినిమా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. మహేశ్ బాబు స్వాగ్‌ను వెండితెరపై సినీ ప్రియులందరూ ఆస్వాదిస్తున్నారు. మహేశ్‌ బాబు చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు కామెడీ, యాక్షన్‌తో అదరగొట్టారు. ఇక మహేష్, కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెన్నెల కిశోర్ మరోసారి తన టైమింగ్‌తో బాబుకి పంచులు వేశాడు. అన్ని హంగులు ఉన్న ఈ సినిమాకు వీకెండ్‌లోనే మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. 



'సర్కారు వారి పాట' తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.36 కోట్ల కలెక్షన్స్‌ వసూల్ చేసింది. రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. రేపు ఆదివారం కావడంతో కలెక్షన్స్‌ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్‌వీపీ  సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా.. సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


Also Read: Venkatesh Salman Khan: సల్మాన్ ఖాన్‌తో వెంకటేష్.. షూటింగ్ డేట్ ఫిక్స్!


Also Read: Viral Video: కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు.. అత్తగారి వంట టార్చర్ భరించలేక..! వీడియో చూస్తే నవ్వులే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.