Viral Video: కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు.. అత్తగారి వంట టార్చర్ భరించలేక..! వీడియో చూస్తే నవ్వులే

Daughter-in-law, Mother-in-la cooking. తాజాగా కొత్తగా పెళ్లయిన ఓ ఇంజనీర్ కోడలు పడే వంట కష్టాలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 06:45 PM IST
  • కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు
  • అత్తగారి వంట టార్చర్ భరించలేక
  • వీడియో చూస్తే నవ్వులే
Viral Video: కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు.. అత్తగారి వంట టార్చర్ భరించలేక..! వీడియో చూస్తే నవ్వులే

Engineer Daughter-in-law making rotis with the help of Mother-in-law: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఉరుకుల పరుగుల మీద గడుస్తోంది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళలకు అయితే వంట గదిలోకి వెళ్లడానికి సమయమే ఉండడం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌లకు. కొందరికి అయితే వంట చేయడం కూడా రాదు. దాంతో పెళ్లయిన తర్వాత అత్తారింట్లో అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. తాజాగా కొత్తగా పెళ్లయిన ఓ ఇంజనీర్ కోడలు పడే వంట కష్టాలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

పెళ్లయిన మరుసటి రోజే ఓ ఇంజనీర్ కోడలని ఆమె అత్తగారు వంటగదిలోకి తీసుకెళుతుంది. కోడలిని వంట చేయమని అత్తగారు  అడుగుతుంది. ఇంజనీర్ అయిన ఆమెకు వంట చేయడంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. దాంతో కోడలు తన అత్తగారి సూచనలతో రోటీలు చేస్తుంది. ఇక కోడలు పేనం మీద రోటీ కాల్చుతుండగా.. అలా కాదు కాల్చేది అని అత్త అంటుంది. చేతితో రోటీని తిప్పు అంటుంది. రోటీ మాడిపోతుంది తిప్పివేయి అని అత్తగారు అనగానే.. కోడలు పేనం లేపి స్టవ్ మీద వేస్తుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanchit and Heena♥️ (@perfectly_arranged)

ఇంజనీర్ కోడలు వంట చేసే తీరు చూసి అత్తగారు తల పట్టుకున్నారు. ఇలా చేశావ్ ఏంటి అని కోడలు తలపై ఒక్కటిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అత్తా, కోడలి వంట డ్రామాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 5 లక్షల లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. 'నేటి కాలంలో అత్త, కోడలు మధ్య ఇలాంటి బంధం చాలా అరుదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'అయ్యో దేవుడా ఈ అమ్మాయికి ఏమైంది' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

Also Read: Split Tongue Viral Video: ఇలాంటి వీడియో ఎప్పుడూ చూసుండరు.. ఒకేసారి రెండు వేర్వేరు పానీయాలు తాగుతున్న లేడీ!

Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌పై స్పందించిన చెన్నై.. సైకలాజికల్ డిస్టర్బెన్స్ అంటూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News