Mammootty Villain Role in Pawan Kalyan's Film: మమ్ముట్టి మలయాళ సినిమా ఇండస్ట్రీకి మెగా స్టార్ అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మలయాళంలోనే కాదు.. దక్షిణాదిన స్టార్ డమ్ ఉన్న అతి కొద్ది మంది సీనియర్ స్టార్ హీరోల్లో మమ్ముట్టి కూడా ఒకరు. మమ్ముట్టి స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ కారణంతోనే అభిమానులకు మమ్ముట్టి అంటే అంత ఇష్టం. అయితే, అలాంటి స్టార్ హీరోకు ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ పోషించాల్సిందిగా అల్లు అరవింద్ మూవీని ఆఫర్ చేశారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్‌ సినిమాలో మమ్ముట్టికి విలన్ పాత్ర
2019 లో మామాంగమ్ ట్రైలర్ లాంచ్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ..  మమ్ముట్టికి తనకు మధ్య గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు. పవన్ కళ్యాణ్‌తో తాను తీస్తున్న సినిమాలో హీరో మమ్ముట్టిని విలన్ పాత్ర పోషించాల్సిందిగా కోరాడట. సినిమాలో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని.. అందుకే పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పి మమ్ముట్టిని అల్లు అరవింద్ కన్విన్స్ చేసేందుకు ట్రై చేశాడట. 


అయితే, ఇదే విషయమై అల్లు అరవింద్ కి మమ్ముట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడట. పవన్ కళ్యాణ్ సినిమాలో స్ట్రాంగ్ విలన్ రోల్ అని ఏదైతే చెబుతున్నావో.. అదే స్ట్రాంగ్ విలన్ రోల్ ని చిరంజీవికి ఆఫర్ చేస్తారా అని అల్లు అరవింద్ ని ఎదురు ప్రశ్నించాడట. అంతేకాదు.. చిరంజీవికి ఆ పాత్ర కంఫర్ట్ గా ఉంటుందా అని ప్రశ్నించాడట. మమ్ముట్టి అడిగిన ప్రశ్న విన్నాకా తాను చేసిన తప్పేంటో అప్పుడు అర్థమైంది అంటూ అల్లు అరవింద్ తన పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. మమ్ముట్టి అంతటి స్థాయి నటుడికి విలన్ పాత్ర ఆఫర్ చేయడం సరికాదని మమ్ముట్టి అడిగిన ప్రశ్న విన్నాకే అల్లు అరవింద్ కి బోధపడిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చారు.


ఇది కూడా చదవండి : Allu Arjun At Vizag Airport: వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్‌కమ్


ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook