Allu Arjun At Vizag Airport: వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్‌కమ్

Allu Arjun At Vizag Airport: విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది. విశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకే అల్లు అర్జున్ గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నాడు.

Written by - Pavan | Last Updated : Jan 20, 2023, 05:11 AM IST
Allu Arjun At Vizag Airport: వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్‌కమ్

Allu Arjun At Vizag Airport: పుష్ప 2  ది రూల్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం రాత్రి వైజాగ్ చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అల్లు అర్జున్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఎదురుచూడసాగారు. అల్లు అర్జున్ విశాఖ వస్తున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు సైతం ఆయనకు రక్షణ కల్పించేందుకు ఎయిర్ పోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే అభిమానులు అల్లు అర్జున్‌ని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.  

అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయిన అల్లు అర్జున్
తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్.. వారికి అలా అభివాదం చేస్తూనే తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ఎక్కి నొవాటెల్ హోటల్ కి వెళ్లిపోయారు. వాహనం వద్ద కూడా అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. 

వెంటనే స్టార్ట్.. కెమెరా.. యాక్షన్..
శుక్రవారం నుండే 10 రోజుల పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది. విశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిపెట్టిన డైరెక్టర్ సుకుమార్.. పుష్ప రాజ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి : Mammootty in PSPK Film: పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్ముట్టికి విలన్ పాత్ర.. ఏమైందో తెలుసా ?

ఇది కూడా చదవండి : Ketika Sharma Images: బ్లాక్ డ్రెస్‌లో కేతిక శర్మ.. మత్తైన చూపులతో మాయ చేస్తోన్న హాట్ బ్యూటీ!

ఇది కూడా చదవండి : Brahmaji Counter to Roja: ఏదీ నన్ను భయపెట్టలేదే?.. రోజాకు బ్రహ్మాజీ కౌంటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x