Allu Arjun At Upasana Party మెగా అల్లు వారి మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్లు, పార్టీల్లో అల్లు అర్జున్ ఎక్కువగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఉపాసన ఇచ్చిన స్పెషల్ పార్టీలో బన్నీ మెరిశాడు. బన్నీతో ఉపాసన ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మై డియర్ ఉప్సీ అంటూ ఉపాసన మీద బన్నీ ప్రేమను కురిపించాడు. అయితే ఈ పార్టీలో బన్నీ, రామ్ చరణ్‌ ఎక్కువగా సందడిగా చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"270543","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అసలే రామ్  చరణ్‌, బన్నీకి మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే రామ్ చరణ్‌ బర్త్ డేకు బన్నీ విషెస్ అందించలేదని టాక్ వచ్చింది. అయితే బన్నీ బర్త్ డేకు రామ్ చరణ్‌ మాత్రం విషెస్ చెప్పాడు. అది కూడా ఏదో ఫార్మాలిటీకి చెప్పినట్టుగా అనిపించింది. అదే అఖిల్‌కు ఎంతో ప్రేమగా విషెస్ చెప్పినట్టు అనిపించింది. దీంతో మళ్లీ రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ మొదలైంది.


 



అయితే ఇప్పుడు బన్నీ మాత్రం ఉపాసన రామ్ చరణ్‌ ఇచ్చిన పార్టీలో కలిసి నవ్వుతూ సందడి చేస్తూ కనిపించాడు. బన్నీ చెర్రీ కలిసి ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందని, గ్యాప్ వచ్చిందనే రూమర్లు చెక్ పడ్డట్టు అయింది. ఇప్పుడు బన్నీ చెర్రీలు ఇలా ఎంతో క్లోజ్‌గా ఉన్న వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ


తాము తల్లిదండ్రులం కాబోతోన్నామనే సంతోషంతో ఈ పార్టీని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీలో మంచు లక్ష్మీ, సానియా మీర్జా కూడా కనిపించారు. ఇక త్వరలోనే రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడు. ఈ ఏడాది రామ్ చరణ్‌కు అంతా పాజిటివ్‌గానే సాగేట్టుగా కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ ఇప్పుడు అంతా కూడా పాజిటివ్‌ నోట్‌లోనే ఉంది. రామ్ చరణ్‌ పేరు అంతర్జాతీయంగా వినిపించడం, చిరంజీవికి వాల్తేరు వీరయ్య హిట్‌ రావడం, సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం విరూపాక్షతో హిట్ పడటం అందరికీ తెలిసిందే.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook