Allu Arjun Vs Rajiniknath: రజనీకాంత్‌నే బీట్ చేసిన ఐకాన్ స్టార్.. పుష్పతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయాడు!
Allu Arjun beats to Superstar Rajinikanth: పుష్ప సినిమాతో సౌత్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఏంటో చూపించిన ఐకాన్ స్టార్.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్‌కు ఉన్న ఫాలోవర్స్‌ను కంటే ఎక్కువ ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నాడు.
Allu Arjun stardom in South Industry: సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దక్షిణాదిలోని అన్ని భాషల ప్రేక్షకులు ఆయన్ని ఎంతో ఇష్టపడతారు.
అయితే రజనీకాంత్‌కంటే (Rajinikanth) ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా మరో సౌత్ హీరో క్రెడిట్ దక్కించుకున్నాడు. రజినీకాంత్‌కు మించిన ఫాలోయింగ్‌తో సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్లే ఆ హీరో ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
పుష్ప మూవీపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి దక్షిణాదిలో అంత పుష్ప మేనియానే సాగింది. పుష్ప మూవీ దక్షిణాదిలోనే కాదు.. దేశమంతా సత్తా చాటింది. అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్‌ను పెంచిన మూవీ కూడా పుష్పనే. దీంతో బన్నీకి ఒక రేంజ్‌లో పాపులారిటీ పెరిగింది.
ఇక అల్లు అర్జున్‌కు ప్రస్తుతం దక్షిణాదిలో రజినీకాంత్ కంటే ఎక్కువగా ఫాలోవర్లు పెరిగారు. ట్విట్టర్‌లో దక్షిణాదిలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీకి (Bunny) ట్విట్టర్‌లో ప్రస్తుతం 6.5 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రజినీకాంత్‌కు 6.1 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు.
ఇక పుష్ప పార్ట్2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. మొత్తానికి అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీతో (Pushpa) పాన్ ఇండియా స్టార్‌గా మారడమే కాదు.. దక్షిణాదిలో తలైవా కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయాడు.
Also Read: Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!
Also Read: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ పర్యటన.. తెలంగాణలో ముందస్తుగా భారీ బందోబస్తు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook