Allu Arjun Birthday: మెగా నీడలోంచి సొంత బ్రాండ్.. గంగోత్రి టు పుష్ప.. అల్లు అర్జున్ కెరీర్లో వివాదాలివే
Allu Arjun Dispute with Mega Family: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. బన్నీ, మెగా ఫ్యామిలీ గ్యాప్ గురించి అందరికీ తెలిసిందే. మెగా నీడలోంచి బయటకు వచ్చి తన సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..
Allu Arjun Dispute with Mega Family: అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. ఆ పేర్లు అప్పుడు ఎక్కువగా వినిపించలేదు. చిరంజీవి మేనేళ్లుడు అంటూ గంగోత్రి సినిమాతో బన్నీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మ్యూజిక్ వల్ల బాగానే హిట్ అయింది. ఆర్య ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలా బన్నీ కెరీర్ ఓ మోస్తరుగా వెళ్తూనే వచ్చింది. బన్నీ, హ్యాపీ, దేశముదురు ఇలా వరుసగా తన స్టైల్లో చేస్తూ వచ్చాడు.
ఇక త్రివిక్రమ్‌తో చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు బన్నీలోని ఇంకో యాంగిల్‌ను చూపించాయి. ఇప్పుడు సుకుమార్ పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. బన్నీ సినిమాలకు కేరళ, నార్త్‌లో ఫ్యాన్స్ ఉంటారు. అయితే బన్నీ మొదట్లో మెగా హీరోగానే పిలవబడ్డాడు. కానీ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఆ ట్యాగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు.
'చెప్పను బ్రదర్' ఎపిసోడ్ నుంచి బన్నీకి మెగా ఫ్యాన్స్‌కు మధ్య గ్యాప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అలా అరవొద్దు.. వేరే హీరో ఈవెంట్లలోనూ ఇలానే అరిస్తే ఎలా అంటూ కాస్త క్లాస్ పీకాడు. అయితే స్టేజ్ మీద మెగా నామస్మరణ చేయడం లేదు. చిరంజీవి పేరు చెప్పడం లేదు. మొన్నటికి మొన్న నటుడిగా ఇరవై ఏళ్లు పూర్తయితే.. కనీసం చిరంజీవికి థాంక్స్ కూడా చెప్పలేదు. చివరకు చిరంజీవే బన్నీకి కంగ్రాట్స్ చెప్పాడు.
Also Read: "Where is Pushpa": బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. వేర్ ఈజ్ పుష్ప అంటూ అంచనాలు పెంచిన సుకుమార్
చివరకు రామ్ చరణ్‌కి సైతం విషెస్ చెప్పలేదు బన్నీ. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బన్నీ.. రామ్ చరణ్‌పై ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. ఎంతో బిజీగా ఉండి.. విషెస్ చెప్పలేదని అనుకుంటే.. ఆ తెల్లారే అయాన్ బర్త్ డేకు స్పెషల్‌గా విషెస్ చెప్పాడు బన్నీ. తన కొడుకు మీద ప్రేమను కురిపించాడు. అలా ఇప్పుడు బన్నీ మెగా ట్యాగ్‌కు దూరంగా ఉంటూ అల్లు బ్రాండ్‌ను ఇంకా బలంగా అందరికీ గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. అందుకే అల్లు స్టూడియోను కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ అంటే మెగా హీరో కాదు.. పాన్ ఇండియన్ హీరో.. ఐకాన్ స్టార్. వేర్ ఈజ్ పుష్ప, కాళీ మాత రూపంలో బన్నీ పోస్టర్ పుష్ప ది రూల్ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.
Also Read: Pushpa The Rule New Poster : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook