టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్‌లో ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు మేకర్స్. అందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నారు. ‘సైనిక’ అనే టైటిల్‌తో సాగే అనే సాంగ్‌‌ను భారతదేశ సైనికులకు అంకితమిస్తున్నట్లు ఇటీవలే అల్లు అర్జున్ తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలిపారు. పూర్తిస్థాయి దేశభక్తి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా, విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటించడం విశేషం. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించడం గమనార్హం.