Allu Arjun Getting Trolled: ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ముందు ఆర్‌ఆర్ఆర్ సినిమాకి సంబంధించి నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినా... అల్లు అర్జున్ విషెస్ చెప్పలేదని ప్రచారం మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద అసూయతో ఉన్నాడు.. ఆ సినిమాలో నటించి ఇద్దరు హీరోలకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఆయన బాధపడుతున్నాడు.. అనే ప్రచారం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకులే అనుకున్నాడో... లేక విష్ చేయడానికి సమయం పట్టిందో తెలియదు గానీ... ఎట్టకేలకు అల్లు అర్జున్ విష్ చేశాడు. ఇప్పుడు ఆ విషెస్‌లో కూడా తప్పులు వెతికి ట్రోలింగ్ చేస్తున్న వారి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.... ఇది భారతదేశానికి ఒక పెద్ద మూమెంట్... తెలుగు సాంగ్ ఆస్కార్‌ను సాధించడం చూసి ఆనందంగా ఉందని పేర్కొన్నారు.


ఈ మేరకు సంగీత దర్శకుడు కీరవాణి గారికి శుభాకాంక్షలు, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మా సోదరులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ... అలాగే గ్లోబల్ స్టార్స్ నా లవ్లీ సోదరుడు రామ్ చరణ్, మన తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్ అంటూ ఒక్కొక్కరి పేరును మెన్షన్ చేస్తూ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మీరు ఆ పాటకు డాన్స్ చేసిన విధానం... అలా చేయడానికి కారణమైన రాజమౌళి వీరంతా ఈ మ్యాజిక్ జరగడానికి కారణమయ్యారు.


ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ రాసుకొచ్చారు. అయితే తారక్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌కు హ్యాపీగానే ఉన్నారు. తెలుగు ప్రైడ్ అంటూ తారక్‌ని గాల్లోకి ఎత్తేయడంతో వారంతా ఆనంద పడుతున్నారు. 


కానీ చరణ్ ఫాన్స్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగడ్తల్లో కూడా ఇలాంటి తేడా ఎందుకు తీసుకువచ్చారు. ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్స్‌ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కావాలని పెట్టాడా? లేదా అనేది ఆయనకే తెలుసు. కానీ ఇందులో కూడా పెడర్థాలు వెతికి ట్రోల్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి.


Also Read: RRR Craze: ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 2.. ఇది కదా క్రేజ్ అంటే?


Also Read: ‘The Elephant Whisperers’ on OTT: ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook