Allu Arjun - Krish: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. గత రెండున్నరేళ్లుగా సుకుమార్ ఈ సినిమాను చెక్కుతున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం అయిందనే ముచ్చట వినపడుతోంది. అయితే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే.. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే.. వీరిద్దరు సినిమా కోసం కాకుండా ఓ యాడ్ కోసం చేతులు కలుపుతున్నారు. ‘థమ్స్ అప్’ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను నియమించిండట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట చిరంజీవి, ఆ తర్వాత మహేష్ బాబు.. విజయ్ దేవరకొండ తర్వాత థమ్స్ యాడ్ ఇపుడు అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లింది. దానికి సంబంధించిన యాడ్ ను త్వరలో షూట్ చేయనున్నారు. ఈ యాడ్ ను క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడట. త్వరలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ లో అల్లు అర్జున్ జాయిన్ కానున్నాడు. ‘వేదం’ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ .. ఈ యాడ్ కోసం పనిచేయడం విశేషం.


ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం పనిచేస్తున్నారు. అటు అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై తెలుగుతో పాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, బోయపాటి శ్రీనులతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు. అటు బాలీవుడ్ లో డైరెక్ట్ గా ఓ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.