Allu Arjun Case: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ విచారణలో భాగంగా అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి నవ్వులు పూయించారు.ముఖ్యంగా పోలీసులు రిమాండ్ రిపోర్టును ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి లాజిక్ మాట్లాడడంతో న్యాయస్థానంలో జడ్జితో సహా పలువురు న్యాయవాదులు కూడా నవ్వుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయంలోకెళితే.. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయం మూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో, హైకోర్టు నుంచి మద్యంతర బెయిల్ మంజూరు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 


ఇకపోతే హైకోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలతో వకీల్ సాబ్ సినిమాలోని కోర్టు సీను రిపీట్ చేశారు. వకీల్ సాబ్ సినిమాలో సూపర్ వుమెన్ భలే పాపులర్ అయింది . వకీల్ సాబ్ పవన్ కోర్టులో కేసు గెలవడానికి సూపర్ వుమెన్ కారణం. అయితే ఆమె పెట్టిన తప్పుడు కేస్ ను హీరో పవన్ వాదించే తీరు అక్కడ చాలా ఫన్నీగా అనిపిస్తుంది.


ఆ సీన్ లో భాగంగా అల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మెయినాబాద్ పోలీస్ స్టేషన్ కి 15 నిమిషాల్లోనే వచ్చేసావా అమ్మ అని వకీల్ సాబ్ అన్నప్పుడు ..సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా ఏదైతే అయిందని జెడ్ స్పీడ్ తో వచ్చేసాను అని ఆమె చెప్పడం,  వకీల్ సాబ్ వాహ్ అని వెటకారంగా అనడం అక్కడ థియేటర్లో నువ్వులు పూయించాయి.



ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విచారణ సందర్భంగా ఆ సీన్ గుర్తు చేశారు నిరంజన్ రెడ్డి. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టుపై వాదనలు వినిపిస్తూ పోలీసులు నిర్లక్ష్యంతోనే ఘటన జరిగింది. థియేటర్లో సినిమా చూసే సమయంలో అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నారు.  పోలీసులు కూడా ఆయనను చూడడానికే బాల్కనీలోకి వెళ్లారు. బందోబస్తును పక్కన పెట్టారు రిమాండ్ రిపోర్టులో చెప్పినట్లు థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన తొక్కేసలాటలో బాధిత మహిళా,  చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోలీసులు కూడా గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చారు. 


దీన్ని బట్టి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు పోలీసులు లేరు. వారు కూడా అల్లు అర్జున్ చూడడానికే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లారు. రిపోర్ట్ లో మాత్రం అంత క్రౌడ్ లో తొక్కిసలాట జరుగుతుండగా మహిళా చిన్నారుల అరుపులు విని కిందకు వచ్చినట్లు రాశారు అంటూ న్యాయవాది పోలీసులను తప్పుపడుతూ అసలు విషయం బయటపెట్టారు. 


 ముఖ్యంగా అల్లు అర్జున్ ని చూసేందుకు పోలీసులు కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడంతోనే ఘటన జరిగిందని దాంట్లో అల్లు అర్జున్ తప్పులేదని, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని తెలిపారు


మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.