Allu Arjun says Iam acting in Bollywood films if required: 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ నుంచి ఫ్యాన్స్‌ ఏం కోరుకున్నారో ఈ సినిమాతో ఇచ్చేశాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని ప్రేక్షకులు ఆశించే స్థాయిలో సినిమా వచ్చింది. ఇక రికార్డుల పరంగా పుష్ప సినిమా బుల్లెట్ రైలులా దూసుకుపోయింది. బాలీవుడ్ బడా చిత్రాలకు కూడా షాక్ ఇస్తూ క్లీన్ హిట్ కొట్టింది. అల్లు అర్జున్ మేనరిజం, డాన్స్, నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప బంపర్ విజయం తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ సముద్రాలు దాటి వెళ్ళింది. ఇప్పుడు సౌత్‌లోని చాలా మంది హీరోలకు హిందీ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే కొందరు బాలీవుడ్‌తో పనిచేయడానికి సముఖత వ్యక్తం చేయగా.. మరికొందరు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బన్నీ ఇండియా టుడే మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ కేవలం తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. హిందీలో నటించడానికి అంతగా కంఫర్ట్ ఉండదని, అయితే బాలీవుడ్ చిత్రంలో పనిచేయడానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు.


'హిందీ సినిమాల్లో నటించడం ప్రస్తుతానికి నా కంఫర్ట్ జోన్‌కు కొంచెం దూరంగా ఉంది. తప్పనిసరి అయితే మాత్రం బాలీవుడ్ చిత్రంలో నటించడానికి నాకు ఇబ్బందేమీ లేదు' అని అల్లు అర్జున్ అన్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు హిందీ సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పడంతో పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అందులే స్టైలిష్ స్టార్ తెలివిగా సమాధానం ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బన్నీది మాములు బుర్రకాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప-2తో బిజీగా ఉన్నారు. 


గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది. హిందీలో కూడా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పుష్ప బంపర్ హిట్ కొట్టడడంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి భాగానికి రూ. 50 కోట్లు తీసుకున్న బన్నీ.. రెండో భాగానికి రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 


Also Read: వివాహానంతరం భారీగా పెంచేసిన నయనతార.. ఏకంగా డబుల్ చేసిందిగా!


Also Read: Cholesterol Control Foods: వీటిని క్రమం తప్పకుండా వాడితే.. కొలెస్ట్రాల్‌ సమస్యలన్నీ 20 రోజుల్లో దూరమవుతాయి..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook