Cholesterol Control Foods: కొలెస్ట్రాల్ పెరడం, బరువు పెరడం వంటి సమస్యలు చాలా సాధారణమైంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసువాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నియమాలు పాటించడం వల్ల సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే దీని కోసం క్రమం తప్పకుండా 4 రకాల ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిని క్రమం తప్పకుండా తినండి:
కూరగాయలు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నివారణకు మార్కెట్ విక్రయించే పోషకాలున్న ఆహారాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా వంకాయ వంటి ఆహారాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కృషి చేస్తాయి.
వెల్లుల్లి:
వెల్లుల్లిపాయలను రోజూ రెండూ తింటే.. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే అల్లిసిన్ LDLలు శరీరంలో పేరకుపోయిన చెడు కొవ్వును నియంత్రిస్తుంది. కావున ఉదయం తప్పనిసరిగా రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తినాలి.
సిట్రస్ కలిగిన పండ్లు:
కొలెస్ట్రాల్ తగ్గించడానికి సిట్రస్ పండ్లు, యాపిల్స్, బెర్రీలు, నారింజ, నిమ్మకాయలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో పెక్టిన్ అనే ఫైబర్‌లు అధిక పరిమాణలంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను సమతుల్యంగా చేయడానికి కృషి చేస్తుంది.
పసుపు:
మనం రోజూ వినియోగించే పసుపుతో కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రిపూట పసుపు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ మూత్రం సహాయంతో బయటకు వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook