అన్ని కోట్ల మంది ‘ButtaBomma Video Song చూశారా!

బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా సాంగ్ (ButtaBomma Full Video Song) యూట్యూబ్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ పూజా హెగ్డే జంటగా తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా విడుదలై మూడు నెలలు కావస్తున్నా పాటలకు మాత్రం క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా సాంగ్ యూట్యూబ్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
మ్యూజిక్ తమన్ స్వరాలు సమకూర్చిన బుట్టబొమ్మ సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకునేందుకు పరుగులు పెడుతోంది. ఓ పాట 10 కోట్ల వ్యూస్ సాధించడమంటే మాటలు కాదు. బుట్టబొమ్మ ఆ ఫీట్‌ను కేవలం 3 నెలల వ్యవధిలో సొంతం చేసుకుంది. Photos: సామాన్యుడి నుంచి మోదీ వరకు చిరుదివ్వెలు
బుట్టబొమ్మా వీడియో సాంగ్‌ను ఇక్కడ వీక్షించండి..
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా పాటలతో మరో మైలురాయిని అధిగమించాడని టాక్ వచ్చింది. బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone
అల వైకుంఠపురములో విజయానికి నాంది పలికింది, కీలకపాత్ర పోషించింది పాటలే. సినిమా విడుదలకు పాటలు ఎంతో ఆసక్తిని పెంచాయి. సామజవరగమన, బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.., రాములో రాములా.. ఎక్కడ విన్నా కొన్ని నెలల నుంచి ఇవే పాటలు వినిపిస్తున్నాయి. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ