Pushpa 2 Success Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి, పలు రకాల రికార్డ్ లను కూడా తిరగరాస్తోంది. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో  కారణంగా ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు.. దీంతో తాను పుష్ప 2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నానంటూ తెలిపారు.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇదే విషయాన్ని కూడా అల్లు అరవింద్ కూడా తెలియజేస్తూ.. తన ఇంట్లోనే ఒక మూల కూర్చున్న తన కొడుకును చూడడం చాలా బాధగా ఉంది. తన కొడుకు సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటూ మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది.అయితే దీంతో అభిమానులు సైతం కాస్త బాధపడినప్పటికీ.. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. 


అసలు విషయంలోకి వెళ్తే.. తన అభిమాని కుటుంబానికి ఇలా జరగడంతో అల్లు అర్జున్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. తన అభిమానులకి అలా ఉండడంతో ప్రెస్ మీట్ లు, సక్సెస్ మీట్లు అన్నిటిని క్యాన్సిల్ చేశామని చెప్పారు. పెద్దపెద్ద ఫంక్షన్స్ ఇతర ప్రాంతాలలో కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ అన్నిటిని క్యాన్సిల్ చేశామని తెలిపారు. 


కానీ పుష్ప 2 సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరడంతో ఒక గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించినట్లు ఒక వీడియో బయటకొచ్చింది.  వీడియోలో  అల్లు అర్జున్ మాటలు, స్టిల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ అందరికీ థాంక్యూ చెబుతున్నట్టుగా ఈ వీడియోలో చూపించారు. అయితే ఇది మొత్తం ఢిల్లీలో జరిగినట్టుగా సమాచారం.. ఆ వెంటనే అల్లు అర్జున్ హౌస్ లో కూడా సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేసినట్లు ఈ వీడియోలో చూపించడం జరిగింది. 


ఇక అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో థాంక్యూ ఢిల్లీ అనే విషయాన్ని కూడా షేర్ చేయడం చూడవచ్చు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన చాలా మంది.. అల్లు అర్జున్  ప్రెస్ మీట్ చూశాక కచ్చితంగా అతనికి జాతీయ అవార్డు కాదు ఏకంగా ఆస్కార్  అవార్డు ఇవ్వడంలో తప్పు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.


 



ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.