Pushpa 2 Sandhya Theatre Controversy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఎఫెక్ట్ కారణంగా మిగతా సినిమాలపై వేటు పడిందనే వార్త గట్టిగా వినిపిస్తోంది.  ముఖ్యంగా పుష్ప -2  సినిమా విడుదలకు సంబంధించి బెనిఫిట్ షోలు వేయగా.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి విచ్చేశారు. హైదరాబాదులో సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సందడి చేయడంతో ఆయనను చూడడానికి అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రోహిణి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత నెలకొంటోంది. ఇక ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. 


సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇకపై బెనిఫిట్ షో లకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కాగా ఈ థియేటర్లో బెనిఫిట్ షో వీక్షించేందుకు అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తొక్కిసలాట నిర్వహించారు. ఆ తొక్కిసలాటలో మహిళా చనిపోయింది 


ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఇకపోతే మంత్రి ఈ నిర్ణయం తీసుకోవడంతో పుష్ప -2  అలాగే అల్లు అర్జున్ పై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసలు కట్టుదిట్టమైన భద్రత లేకుండా ఎలా థియేటర్ కి వెళ్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఇక అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప -2 గత మూడు ఏళ్లుగా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంది. తన అభిమానుల మధ్య సినిమా చూడాలనుకున్న అల్లు అర్జున్ కి  ఇప్పుడు అసలు చిక్కు వచ్చి పడింది. మొత్తానికి అయితే ఈయన కారణంగా బెనిఫిట్ షోలు మొత్తం రద్దడంతో నిర్మాతలు ఫైర్ అవుతున్నారు.


Also Read: Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్‌'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు


Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.