Pushpa 2 The Rule Movie: ఐకాన్ స్టార్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా కోసం స్వయంగా నాగబాబు రంగంలోకి దిగారు. తన అల్లుడి సినిమా అడ్డుకుంటానని చెప్పిన వారికి నచ్చజెప్పి వారిని విరమించుకునేలా ప్రయత్నం చేశారు. దీంతో జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు వెనక్కి తగ్గడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరూ 'పుష్ప 2' సినిమా చూడాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. పుష్ప సినిమా పేరు ప్రస్తావించకుండా సినిమాలను ఆదరించాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది.
Also Read: AP Wine Shops: ఏపీలో మందుబాబులకు షాక్.. రేపు వైన్స్ బంద్
వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
రాజకీయంగా వేరే దారి చూసుకున్న అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామని కొంతమంది జనసేన పార్టీ నాయకులు ప్రకటించడం కలకలం రేపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నాగబాబు ఫోన్‌లో ఆదేశాలు ఇవ్వడంతో కొందరు నాయకులు వెనక్కి తగ్గారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు చలమల శెట్టి రమేశ్ అడ్డుకుంటామని పిలుపునివ్వగా.. నాగబాబు వారించారు. హనుమాన్ జంక్షన్ కృష్ణ థియేటర్ వద్ద ప్రెస్‌మీట్ పెట్టి పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని చెప్పగా దానిని జనసేన నాయకులు వెనక్కి తీసుకున్నారు.
Also Read: Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత
నాగబాబు ఆదేశాలతో..
పుష్ప-2 అల్లు అర్జున్ సినిమా అడ్డుకుంటానని ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు జనసేన నాయకులు చలమల శెట్టి రమేశ్ ప్రకటించారు. అడ్డుకుంటామని చెప్పిన వీడియోను చూసి జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ కొణిదల నాగబాబు స్వయంగా ఫోన్ చేశారని తెలిపారు. 'నాగబాబు ఫోన్ చేసి రాజకీయం వేరు సినిమాల వేరు అన్నారు. మీరు సినిమాలు ఆపే విషయంలో పునరాలోచించుకోవాలని సూచన చేశారు. నాగబాబు ఆదేశాల మేరకు పుష్ప-2 సినిమాని అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాం' అని వెల్లడించారు.
కాగా పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న వివాదం.. రచ్చ నేపథ్యంలో నాగబాబు కీలకమైన ట్వీట్ పోస్టు చేశారు. పుష్ప 2 సినిమా పేరును.. అల్లు అర్జున్ పేరును ప్రస్తావన తీసుకోకుండా 'ప్రతి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తి కోరుకుందాం' అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. '24 క్రాఫ్ట్ ల కష్టంతో.. వందల మంది టెక్నీషన్ల శ్రమతో.. వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని.. ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నా' అని 'ఎక్స్'లో నాగబాబు పోస్టు చేశారు.
24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని…
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 4, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.