Pushpa 2 at Prasad Multiplex
ఇందులో చాలామంది సినిమా చూడడానికి మక్కువ చూపుతూ ఉంటారు. తాజాగా విడుదలైన పుష్ప-2 చిత్రం ఇందులో చూడాలని అభిమానులకు సినీ ప్రియులకు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నప్పటికీ కానీ తాజాగా నిరాశ మిగిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ చిత్రాన్ని తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీం ఇటీవలే ప్రకటించింది.. అందుకు సంబంధించి ఈరోజు ఉదయం ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు.. సినీ ప్రేక్షకులకు అత్యుత్తమైన సినిమాటిక్ అనుభూతిని సైతం అందించడం మా లక్ష్యం అని, రెండు దశాబ్దాలుగా తాము ఎంతో కష్టపడి పని చేస్తున్నాము.. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల చేత పుష్ప-2 చిత్రాన్ని మీ ముందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించలేకపోయామని తెలిపారు.  మీకు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము అంటూ తెలియజేశారు. 



అయితే పుష్ప-2 సినిమాని ప్రదర్శించకపోవడానికి గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.. ప్రస్తుతం మాత్రం ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ సినిమా మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.. పుష్ప సినిమా మొదటి భాగం విడుదలై మూడేళ్ల తర్వాత పుష్ప-2 చిత్రం విడుదల అయింది.. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


మొత్తానికి పుష్ప-2 సినిమా అటు అల్లు అర్జున్ కెరియర్ రష్మిక కెరియర్ కి కీలకంగా మారింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరొకసారి వీరి పేరు మారుమ్రోగుతోంది.


Also Read: Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌.. అడ్డుకున్న హరీశ్‌ రావుతో సహా మిగతా నేతల నిర్బంధం


Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్‌ సీఐతో రచ్చరచ్చ



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.