Allu Arjun Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. పాన్ ఇండియా పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కి సైతం నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ మొదలయ్యి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా భారీ షూటింగ్ పెండింగ్ లో ఉందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా యూనిట్ ఈ మధ్య విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కావాలి కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ చిత్రం ఆగస్టులో కూడా విడుదల నోచుకోనట్టు తెలుస్తోంది.


ఈ సినిమా అప్డేట్స్ చాలా ఆలస్యం అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఏకంగా గీతా స్టూడియోస్ ముందర గత కొద్ది నెలల క్రితం ధర్నా చేసిన సంగతి తెలిసిందే. అంత పెద్ద రచ్చ అయ్యాక ఈ మధ్య మాత్రం చిన్న గ్లిమ్స్.. పోస్టర్లు విడుదల చేసి అల్లు అర్జున్ అభిమానులను ఖుషి చేశారు ఈ సినీ మేకర్స్. అయితే షూటింగ్ మాత్రం శరవేగంగా జరగడం లేదని సమాచారం


నిన్న మొన్నటి వరకు ఈ సీక్వెల్ కి సంబంధించి చాలా శాతం షూటింగ్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఇటీవల బన్నీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా పుష్ప 2 షూటింగ్ నుంచే వస్తున్నా అని చెప్పాడు. ఇక ఈ సినిమాలో పుష్పవల్లి కార్యక్రమంలో కనిపించిన రష్మిక కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..’ పుష్ప 2 మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ఉంటుంది. డ్రామా సీన్స్ కూడా చాలా ఉంటాయి. ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా’ అని చెప్పుకొచ్చింది. 


తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా కోసం రష్మికని ఎక్స్‌ట్రా 50 రోజులు షూటింగ్ డేట్స్ అడిగారట. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కాగా ఇప్పుడు రష్మికానీ 50 రోజులు అడిగారంటే ఇక తప్పకుండా రెండు నెలల షూటింగ్ పెండింగ్ ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. అంటే సినిమా కంటిన్యూగా షూట్ చేసినా కనీసం రెండు నెలలు షూట్ ఉంది. 


అయితే ఈ 50 రోజుల షూట్ కాకుండా ఇంకా వేరే సీన్స్ కూడా చాలా చిత్రీకరించాలంట.‌ ఇవన్నీ షూట్ కంప్లీట్ చేయడానికి నాలుగు నుంచి అయిదు నెలలు పట్టినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఆగస్టు 15న చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా అనేది సందేహమే. 


ప్రస్తుతం అన్ని సినిమా విడుదల తేదీలు పోస్ట్ పోన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్పా సీక్వెల్ కూడా ఆగస్టు నుంచి నవంబర్ లేదా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అని గట్టిగా వినిపిస్తోంది.


Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook