Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

Dream Come to True: చిన్న ఆలయం.. భక్తులు ఇచ్చే సంభావనే అతడి ఆదాయం. వృత్తి పౌరోహిత్యం.. సంపాదన మాత్రం అంతంతే. కానీ ఆ పూజారి ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అంత స్థోమత లేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే చిల్లరనే పొగేసుకుని ఎట్టకేలకు తన కలను తీర్చుకున్నాడు. వాహనం కొనుగోలు కోసం ఆయన మొత్తం నాణేలు తీసుకెళ్లడం వైరల్‌గా మారింది. ఆయన తీసుకెళ్లిన చిల్లరను లెక్కించేందుకు బైక్‌ షోరూమ్‌ నిర్వాహకులు తంటాలు పడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 04:38 PM IST
 Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

Priest Buys Scootey: మంత్రాలు పఠించడం తప్ప అతడికీ ఏదీ రాదు. పూజలు, శుభకార్యాలు, దినాలు చేయడం మినహా మిగతా పని రాదు. అలాంటి పూజారికి ఎన్నో ఏళ్లుగా ఒక వాహనం కొనుగోలు చేయాలని ఉండేది. భక్తులు ఇచ్చిన సంభావన మీద బతికే అతడికి బైక్‌ కొనడం భారంగా అనిపించింది. అయినా సరే అంటూ రూపాయి రూపాయి పోగేసి చిల్లరన్నంతా జమ చేసి ఎట్టకేలకు వాహనం కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే వాహనం కొనుగోలు చేసేందుకు చిల్లర నాణేలను తీసుకెళ్లడం గమనార్హం. బైక్‌కు కొనుగోలుకు చెల్లించిన మొత్తం రూ.లక్షా 30 వేలు కూడా నాణేలే ఉండడం గమనార్హం. దీంతో ఆ నాణేలను లెక్కించడానికి షోరూమ్‌ నిర్వాహకులు తంటాలు పడ్డారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

ఏపీలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లి గ్రామానికి చెందిన మురళీధర్‌ ఆచార్యులు ఓ పూజారి. స్థానికంగా ఉన్న కాల భైరవ స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నారు. భార్యతో నివసిస్తూ పూజా కార్యక్రమాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే భార్య ఉషకు స్కూటీ మీద తిరగాలనే ఆశ ఉంది. గుడిలో.. భక్తుల ఇళ్లల్లో పూజలు చేస్తే వచ్చే సంభావనతో జీవితం గడుపుతున్న వారికి స్కూటీ కొనడం తలకు మించిన ఆర్థిక భారం. అయితే తన భార్య కోరిక తీర్చాలనుకున్న మురళీధర్‌ ఆచార్యులు మూడేళ్లు కష్టపడ్డారు.

ఆలయంలో భక్తులు ఇచ్చే కానుకలే కాకుండా.. బయట పూజా కార్యక్రమాలు చేస్తూ మురళీధర్‌ ఇచ్చే సంభావనను అంతా జమ చేస్తున్నాడు. మూడేళ్లకు స్కూటీ కొనాల్సిన డబ్బు జమ అవడంతో ఇటీవల వాహనం షోరూమ్‌కు వెళ్లి వివరాలు కనుక్కున్నారు. అయితే మొత్తం చిల్లర ఇస్తానని చెప్పడంతో మొదట నిర్వాహకులు నిరాకరించారు. తన పరిస్థితిని పూజారి వివరించడంతో ఎట్టకేలకు నిర్వాహకులు అంగీకరించారు. మొత్తం నాణేలను గోనే సంచుల్లో షోరూమ్‌కు తీసుకొచ్చారు. ఒక్క రూపాయి, రెండు రూపాయిలు, ఐదు రూపాయల నాణేలు ఉన్నాయి. 

నాణేలు లెక్కించేందుకు షోరూమ్‌ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. బల్లలపై నాణేలు వేసి ఇద్దరు ముగ్గురు కొన్ని గంటలపాటు లెక్కపెట్టారు. వాహనానికి కావాల్సిన రూ.1.30 లక్షల నాణేలు షోరూమ్‌ నిర్వాహకులు తీసుకున్నారు. అనంతరం పూజారికి స్కూటీని అందజేశారు. ఎప్పటి నుంచో ఉన్న కల సాకారం కావడంతో పూజారి మురళీధర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటికి తీసుకెళ్లి తన భార్య ఉషను ఎక్కించుకుని మురళీధర్‌ తిరిగారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భార్యకు వాహనం కొని ఇవ్వడానికి పూజారి పడిన కష్టాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read: Power Bills: కేటీఆర్‌ సంచలన ప్రకటన.. కరెంట్‌ బిల్లులు కట్టొద్దని తెలంగాణ ప్రజలకు పిలుపు

Also Read: Revanth Reddy London Tour: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. విఖ్యాత ప్యాలెస్‌లో ప్రసంగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News