Pushpa Making Video: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప' (Pushpa Movie) చిత్రం రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా పుష్ప మూవీ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇదే వీడియోలో (Pushpa Making Video) చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి బన్నీ చేసిన ఓ అప్పీల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారేడుమిల్లి అడవుల్లో పుష్ప మేకింగ్‌కి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. నటీనటులు, టెక్నీషియన్లకు దర్శకుడు సుకుమార్ సన్నివేశాలను వివరిస్తుండటం ఇందులో కనిపిస్తోంది. ఇక ఇదే వీడియోలో అల్లు అర్జున్ (Allu Arjun) చేతిలో మైక్ పట్టుకుని చిత్ర యూనిట్‌కు ఓ అప్పీల్ చేస్తున్నారు. 'నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్.. ఇక్కడ షూటింగ్ జరిగినంత కాలం అందరూ ఎవరి ప్లాస్టిక్ కప్పులు, వాళ్ల బాటిళ్లు, వాళ్ల పేపర్లు డస్ట్‌ బిన్‌లో పడేయండి. మనం ఇక్కడికి ఎలా వచ్చామో... అలా నీట్‌గా బయటికెళ్లిపోదాం...' అని విజ్ఞప్తి చేశారు. పుష్ప షూటింగ్ కారణంగా ఆ అటవీ ప్రాంతం ప్లాస్టిక్‌ వస్తువులతో నిండిపోకూడదన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 


పుష్ప మేకింగ్ వీడియో పట్ల అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) హార్డ్ వర్క్‌కి తప్పకుండా మంచి విజయం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. మొదటిసారి అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల్లో అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్‌లో అదరగొట్టాడు. అల్లు అర్జున్-రష్మిక మందనా హీరో హీరోయిన్లుగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్ విడుదలవనుండగా... డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


 



Also Read: హృతిక్ ​మాజీ భార్య​​ రిలేషన్​షిప్​పై స్పందించిన బాలీవుడ్ హీరో.. తను, నేను అంటూ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook