హృతిక్ ​రోషన్​ మాజీ భార్య​​ రిలేషన్​షిప్​పై స్పందించిన బాలీవుడ్ హీరో.. తను, నేను అంటూ క్లారిటీ ఇచ్చేశాడు!!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్స్​లన్ గోని సోషల్ మీడియాలో తమపై వస్తున్న రూమర్స్​ గురించి స్పందించాడు. హృతిక్​ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ తనకు మంచి స్నేహితురాలు అని స్పష్టం చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 04:38 PM IST
  • హృతిక్ ​రోషన్​ మాజీ భార్య​​ రిలేషన్​షిప్​పై స్పందించిన అర్స్​లన్​ గోని
  • సుస్సానే ఖాన్‌తో డేటింగ్ రిలేషన్​షిప్​పై స్పందించిన బాలీవుడ్ హీరో
  • హృతిక్​ రోషన్ మాజీ​ భార్యతో రిలేషన్​
హృతిక్ ​రోషన్​ మాజీ భార్య​​ రిలేషన్​షిప్​పై స్పందించిన బాలీవుడ్ హీరో.. తను, నేను అంటూ క్లారిటీ ఇచ్చేశాడు!!

Arslan Goni Breaks silence about his rumoured relationship with Sussanne Khan: 2017 విడుదలైన జియా ఔర్ జియా చిత్రంతో అర్స్​లన్​ గోని (Arslan Goni) బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అర్స్​లన్​​ చాలా కాలంగా వెలుగులోకి రాలేదు. అయితే బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్ (Hrithik Roshan,) మాజీ భార్య సుస్సానే ఖాన్‌ (Sussanne Khan)తో డేటింగ్​ చేస్తున్నట్లు కొద్ది కాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మనోడికి మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సంవత్సరం సుస్సానే పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతికొద్ది మంది అతిధులలో అర్స్​లన్​​ కూడా ఒకడు. దాంతో సుస్సానేతో అతడు డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. 

ఇటీవల సుస్సానే ఖాన్ (Sussanne Khan) తన పుట్టినరోజు వేడుకను గోవాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పార్టీలో ఆమెతో కలిసి దిగిన ఫొటోను అర్స్​లన్ గోని (Arslan Goni) పోస్ట్​ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే డార్లింగ్. మీకు సంవత్సరం బాగా గడవాలి. అద్భుతమైన జీవితం ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో నేను చూసిన మంచి మనసు మీకు ఉంది. ఇది గొప్ప చిత్రం. భగవంతుడు మీకు కావలసిన ప్రతిదానిని మీకు ప్రసాదించుగాక. బోలెడంత ప్రేమ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో సుస్సానేతో అర్స్​లన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. 

Also Read: BWF World Tour Finals: బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. ఒక్క టైటిల్ లేకపాయే!!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్స్​లన్ గోని (Arslan Goni) సోషల్ మీడియాలో తమపై వస్తున్న రూమర్స్​ గురించి స్పందించాడు. సుస్సానే ఖాన్ (Sussanne Khan) తనకు మంచి స్నేహితురాలు అని స్పష్టం చేశాడు. 'సోషల్​ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం సహజమే. గోవాలో జరిగింది కేవలం బర్త్​డే పార్టీ మాత్రమే. స్నేహితుల పుట్టినరోజు వేడుకకు ఎవరైనా వెళ్లొచ్చు. నెటిజన్లు ఎప్పుడు ఏదో ఒకటి ఊహించుకుంటారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. సుస్సానే, నేను మంచి స్నేహితులం. అంతకుముంచి ఏమీ లేదు. ఆమె చాలా మంచి వ్యక్తి. గొప్ప మనసున్న మనిషి' అని గోని పేర్కొన్నాడు. 

Also Read: Omicron Case: గుడ్‌న్యూస్..కోలుకున్న ఒమిక్రాన్ తొలి బాథితుడు

2000 డిసెంబర్ 20న హృతిక్​ రోషన్​ (Hrithik Roshan,), సుస్సానే ఖాన్ (Sussanne Khan) అంగరంగ వైభాగంగా వివాహం చేసుకున్నారు. అనోన్య జంట అని పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరికి రిహాన్​, హృదాన్​ కుమారులు ఉన్నారు. ఏమైందో ఏమోగానీ 2013 డిసెంబరులో ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో హృతిక్​ రోషన్​, సుస్సానే ఖాన్ వేరే వారితో ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి. విడాకులు అయి 7-8 ఏళ్లు గడిచినా ఇద్దరూ మరో పెళ్లి చేసుకోలేదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arslan Goni (@arslangoni)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News