Where is Pushpa Social Media Record అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బన్నీ బర్త్ డే అంటూ ఏప్రిల్ 8న సోషల్ మీడియాలో జరిగిన సందడి గురించి చెప్పాల్సిన పని లేదు. పుష్ప ది రూల్ సినిమా ఎలా ఉండబోతోందో చూపించాడు. ఇక వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ రిలీజ్ చేసిన వీడియోతో బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బన్నీని చూపించిన తీరుకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో పులితో పెట్టిన సీన్‌కు థియేటర్లో పూనకాలు రావాల్సిందే. అయితే ఇందులో సినిమా స్టోరీని చెప్పకనే చెప్పేశాడు. పుష్పని జైల్లో వేయడం, అందులోంచి తప్పించుకోవడం, బుల్లెట్ల గాయాలతో బయటపడటం, అడవిలోనే పుష్ప ఉండిపోవడం, నెల రోజులైనా కూడా బయటకు రావడం, ఇక పుష్ప తాను సంపాదించిన డబ్బుని పేదలకు పంచి రాబిన్ హుడ్ రేంజ్‌లో ఎదిగినట్టు చూపించాడు.


ఇక ఇప్పటికీ వేర్ ఈజ్ పుష్ప వీడియో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తోంది. 82 మిలియన్ల వ్యూస్, మూడు మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతోంది. పుష్ప ది రూల్ సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ ఎంతో శ్రద్ద తీసుకున్నాడని, కథలో ఇంకా మార్పులు చేర్పులు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


అయితే బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వేర్ ఈజ్ వీడియో ప్రమోషన్స్ కోసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసం కచ్చితంగా ఖర్చు పెట్టాలని మైత్రీని బన్నీ అడిగినట్టు.. మైత్రీ కూడా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టేందుకు సిద్దపడినట్టు తెలుస్తోంది. అయితే వేర్ ఈజ్ పుష్ప అంటూ అంచనాలు పెంచడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook