Renu Desai- Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు, రేణూ దేశాయ్‌కి మధ్య గత మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా ఫోటోలు గానీ వీడియో గానీ షేర్ చేయమని, మా అన్న కొడుకుని చూడాలని మాకు ఉండదా? అంటూ ఓ అభిమాని వేసిన పోస్ట్ మీద రేణూ దేశాయ్ స్పందించడంతో.. ఈ రచ్చ అంతా మొదలైంది.మీ అన్న కొడుకు ఏంటి?.. అకిరా నా అబ్బాయి అంటూ కాస్త ఘాటుగా స్పందించింది రేణూ దేశాయ్. దీంతో గొడవ మొదలైంది.
అకిరాను చూడాలనే ప్రేమతోనే అలా అడుగుతారు తప్ప.. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు కదా? అయినా.. తండ్రి పేరుతోనే కదా? బిడ్డల్ని గుర్తిస్తారు.. అదే మన సంప్రదాయం అంటూ ఇలా కొందరు రేణూ దేశాయ్ మీద మాటలతో దాడి చేశారు. ఇలా రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వాగ్వాదం జరుగుతూనే వస్తోంది. తాజాగా రేణూ దేశాయ్‌కి మద్దతుగా ఓ పోస్ట్ కనిపించింది. అందులో ఇలా ఉంది..
'రేణూ అక్క.. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్.. విడిపోయి ఇన్నేళ్లు అవుతున్నా.. జనాలు ఇలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే.. మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు.. మీ మెంటల్ హెల్త్‌ను ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు.. అసలు విడిపోవడం అనేదే తట్టుకోలేం.. అయినా మీరు మీకు వీలైనంత ధృడంగా నిలబడుతూనే ఉన్నారు.. పిచ్చి అభిమానులు మిమ్మల్ని ట్రోల్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. మీకు మరింత బలాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే అభిమానుల నోరు మూయించేందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడో నాకు అర్థం కావడం లేదు..
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించే స్పందించలేని పవన్ కళ్యాణ్.. ఓ రాష్ట్రాన్ని ఎలా కాపాడగలడు.. అసలు మీ వైవాహిక జీవితంలో ఏం జరిగింది.. ఎవరిది తప్పు.. ఎవరు కరెక్టర్ అన్నది మీ పర్సనరల్.. ఆమె బతుకుని ఆమె బతకనివ్వండి అని పవన్ కళ్యాణ్ చెబుతాడని ఆశిస్తున్నాను..
అప్పుడే ఈ అభిమానులు ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉంటారు.. వెనకాల ఏం జరిగిందో తెలియదు గానీ.. ఓ మహిళను నిజంగా గౌరవిస్తే.. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వొచ్చు కదా? అంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను బయటపెట్టేసింది. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. ఇలా ఎంతో మంది నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నారు.. నా కంట్రోల్‌లో లేని దాని గురించి నేనేం చెప్పను.. ఎలా చెప్పను అని బాధపడింది రేణూ దేశాయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook