Allu Arjun: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..
National Film Awards: తెలుగులో ఇప్పటి వరకు ఏ యాక్టర్ సాధించలేని అరుదైన ఘనతను అల్లు అర్జున్ సాధించి చూపించాడు. దిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డును స్వీకరించారు.
69th National Film Awards: 69వ జాతీయ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇన్నాళ్లు ఏ తెలుగు నటుడికి రాని గుర్తింపు అల్లు అర్జున్ కు దక్కింది. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) జాతీయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. అల్లు అర్జున్ అవార్డు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ అవార్డు ఫంక్షన్‌లో ముందుగా నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనాలు ఉప్పెన సినిమాకు గానూ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అనంతరం బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సోలోమాన్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 'నాటు నాటు' పాటకు ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఎమ్.ఎమ్. కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ సింగర్‌గా కాల భైరవ(ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్(కొండపొలం), ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌కు గానూ శ్రీనివాస్ మోహన్(ఆర్‌ఆర్‌ఆర్) అవార్డులు అందుకున్నారు. వినోదాత్మక చిత్రంగా ఎంపికైన ఆర్‌ఆర్‌ఆర్‌కు గానూ రాజమౌళి నేషనల్ అవార్డును తీసుకున్నారు. పుష్ప సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు.
Also Read: Leo Title Controversy: 'లియో' టైటిల్ వివాదంపై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ.. ఆ రోజే విడుదల..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook