Allu Arjun Viral Video: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. 2021 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సీక్వెల్ గా.. పుష్ప 2 సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే సుమారుగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు కాబట్టి దూసుకుపోతోంది. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే.. రూ.1000కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది. అయితే ఈ ఆనందాన్ని చిత్ర బృందం పొందలేకపోతుందని చెప్పవచ్చు. దీనికి కారణం డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోస్ సందర్భంగా.. జరిగిన ఘటన.. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా.. అక్కడికి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సహా వచ్చారు.. అయితే తొక్కిసలాటలో జరగగా..  ఆ తొక్కిసలాటలో రేవతి మరణించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ విషయం అల్లు అర్జున్ కి తెలిసి కూడా ఆయన తనకు తెలియదని..చెప్పడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవలే ఆయనను పోలీసులు విచారించగా.. అందులో మొత్తం 18 ప్రశ్నలు అడగ్గా కేవలం 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ థియేటర్ కి.. వచ్చిన కొద్దిసేపటికే రేవతి మరణించింది.  ఈ విషయం ఆయనకు ముందే తెలుసు కానీ.. ఆయన ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం తనకు తర్వాత రోజే తెలిసిందని.. అబద్ధాలు చెప్పారు అనేది సోషల్ మీడియాలో ఎంతోమంది వాదన. అయితే విచారణలో కూడా  ఈ విషయంపై ప్రశ్నించగా అల్లు అర్జున్ సైలెంట్ గా ఉండిపోయినట్లు.. సమాచారం. 


ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటి అంటే అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలోనే ఒక డైలాగ్. ఈ సినిమాలో ఒక సీన్ లో అల్లు అర్జున్..”ఆయన ఏదో తప్పు చేసి ఉండాలి,” అనగా.. వెంటనే టబు ఏమిటది అని అడుగుతుంది.. అప్పుడు అల్లు అర్జున్ “రేవతి” అని సమాధానం ఇస్తారు. ఇది ఆ సినిమాలో సందర్భానుసారం వచ్చే సీన్. అయితే ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తూ.. అల్లు అర్జున్ ప్రస్తుత సందర్భాలు ఈ సీన్ కి కరెక్టుగా సెట్ అయ్యాయని అందరూ కామెంట్స్.. పెడుతున్నారు. మరికొందరేమో.. అల్లు అర్జున్ కి రేవతి విషయం అప్పుడే తెలిసిందంటుంది. అంటూ చమత్కారమైన కామెంట్లు సైతం పెడుతున్నారు. మొట్టానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.


 



Also Read: TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!


Also Read: TFI Meets Revanth Reddy: సినీ ప్రముఖుల ప్రతిపాదనలు.. సీఎం ఏమన్నారంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.