Allu Arjun Review On Hi Nanna: నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. తండ్రీకూతుళ్ళు ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల అయ్యి చూసిన వారి దగ్గర ప్రశంసలు అందుకుంటుంది. కలెక్షన్స్ పరంగా నాని గత చిత్రాలను మీట్ కాకపోయినా.. ప్రశంసల పరంగా మాత్రం ఈ చిత్రం తీసుకుపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా మొన్ననే యానిమల్ సినిమా రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు హాయ్ నాన్న సినిమా రివ్యూ కూడా ఇచ్చేశారు. హాయ్ నాన్న సినిమా అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో ఈ హీరో వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చిత్రయూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.


 



‘హాయ్ నాన్న సినిమా యూనిట్ కి నా అభినందనలు. చాలా మంచి సినిమా, మనసుని హత్తుకుంది. ముఖ్యంగా నాని గారు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథలని బయటకి తెచ్చినందుకు మీ మీద గౌరవం పెరిగింది. మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేశారు…తన నటన తనలాగే అందంగా ఉంది. బేబీ కియారా నీ క్యూట్ నెస్ తో మా గుండెల్ని హత్తుకున్నావు. ఇంక చాలు, స్కూల్ కి వెళ్ళు. సినిమాలోని మిగిలిన ఆర్టిస్టులందరికి కంగ్రాట్స్. 
డైరెక్టర్ శౌర్యువ్‌ హై, కెమెరామెన్ సాను వరుగేస్, సంగీత దర్శకులు హేశం అబ్దుల్ వహీద్ వర్క్ బాగా చేశారు. శౌర్యువ్‌ నీ మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పిస్తున్నావు. ఎమోషనల్ సన్నివేశాలను మనసుకి హత్తుకునేలా చూపించారు ఇలాగే ముందుకెళ్లాలి, కంగ్రాట్స్. నిర్మాతలకు కూడా ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు కంగ్రాట్స్. హాయ్ నాన్న సినిమా కేవలం ఫాదర్స్ కి మాత్రమే కాదు ప్రతి కుటుంబాన్ని తాకుతుంది’ అని పోస్ట్ వేశారు మన బన్నీ.


దీంతో నాన్న సినిమాపై అల్లుఅర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. నాని అభిమానులు థ్యాంక్స్ చెప్తూ పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ ట్విట్ కి నాని రిప్లై ఇస్తూ.. అర్హ వాళ్ళ నాన్న మెచ్చుకున్నారు. థ్యాంక్స్ బన్నీ.. అంటూ హాయ్ నానా స్టైల్ లో రిప్లై ఇచ్చారు.



కాగా కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు రెండు కోట్ల తొంభై ల‌క్ష‌ల‌ వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా, శ‌నివారం రోజు మాత్రం నాలుగు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి. 


Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి